EntertainmentLatest News

రైలు కింద పడి జబర్దస్త్ ఆర్టిస్ట్ మరణం


తెలుగు  ప్రజలని  నవ్వులతో  ముంచెత్తే   కామెడీ  షో  జబర్దస్త్.  ఈ  షో  వచ్చే  టైం కి  ఎన్ని పనులు ఉన్నా మానుకొని మరి టీవీ ల ముందు అతుక్కుపోతారు. సినిమా హీరోలు కూడా ఈ షో కి అభిమానులు గా ఉన్నారు.అంతటి కీర్తిని సంపాదించిన ఈ షో కి సంబంధించిన ఒక ఆర్టిస్ట్ మరణ వార్త  అందరిలో విషాదాన్నినింపుతుంది

మహ్మద్దీన్..భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని  చుంచుపల్లి మండలం నందాతండా ఆయన స్వగ్రామం.. జబర్దస్త్‌ ప్రోగ్రాం లో  దాదాపు   50 ఎపిసోడ్‌లలో కనిపించాడు. రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి సుపరిచయస్తుడే.   హైదరాబాద్‌లో షూటింగ్‌ ఉండటంతో.. ట్రైన్ ఎక్కేందుకు భద్రాచలం రోడ్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు . కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ స్టేషన్‌లో నుంచి ముందుకు కదులుతోంది.. ఆ సమయంలో ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే కాలు జారి కిందకు జారిపడటంతో ట్రైన్, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయాడు.  గమనించిన తోటి ప్రయాణికులు చైన్ లాగడంతో లోకో పైలెట్ రైలును ఆపాడు 

వెంటనే అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు, సిబ్బంది.. మహ్మద్దీన్‌ను అతి కష్టం మీద బయటకు తీసి అంబులెన్స్‌లో కొత్తగూడెం జిల్లా ఆస్పత్రికి తరలించారు. టెస్టులు చేసిన డాక్టర్లు..  మహ్మద్దీన్ నడుము, పక్కటెముకలకు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు.  ప్రాథమిక చికిత్స చేసి.. మెరుగైన వైద్యం ఖమ్మం తరలించాలని సూచించారు. వెంటనే తీసుకెళ్తుండగా.. మార్గం మధ్యలోనే   తుదిశ్వాస విడిచాడు. డెడ్‌బాడీని సర్వజన ఆస్పత్రికి తరలించారు.. అక్కడ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ కంప్లైంట్‌తొ పోలీసులు కేసు నమోదు చేశారు.మహ్మద్దీన్‌ కి   భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 



Source link

Related posts

జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్.. 'మంగళవారం' చిత్రానికి ఎన్ని అవార్డులు వచ్చాయో తెలుసా?

Oknews

ఆకట్టుకుంటున్న అనిల్ జీలా మేళా ట్రైలర్ రివ్యూ!

Oknews

Jobs at the US Embassy and Consulates Hyderabad details here |

Oknews

Leave a Comment