Health Care

రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్‌మెంట్‌లో వయోపరిమితి పెంపు.. ఎంతో తెలుసా..


దిశ, ఫీచర్స్ : రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్‌మెంట్ కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ దరఖాస్తు దారుల వయోపరిమితిని పెంచింది. ఈ మేరకు రైల్వే శాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అభ్యర్థుల కోరిక మేరకు వయోపరిమితిని రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అసిస్టెంట్ లోకో పైలట్ మొత్తం 5696 పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ జరగనుంది. ఈ మేరకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 20, 2024 నుండి ప్రారంభమైంది. రైల్వే శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, వయోపరిమితిలో సడలింపు తర్వాత, అభ్యర్థులు 31 జనవరి 2024 నుండి ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 19 ఫిబ్రవరి 2024 వ తేదీన దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ.

వయోపరిమితిలో ఎంత సడలింపు ఇస్తారు ?

వయోపరిమితి సడలింపు 3 సంవత్సరాల వరకు ఇవ్వనంది. ఇప్పుడు జనరల్ కేటగిరీ గరిష్ట వయోపరిమితిని 33 ఏళ్లకు పెంచారు. గతంలో దరఖాస్తు చేసుకోవడానికి జనరల్ కేటగిరీకి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయోపరిమితిని నిర్ణయించారు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు మునుపటిలా గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు పొందుతారు. ప్రస్తుతం వయస్సు జూలై 1, 2024 నుండి లెక్కించ నున్నారు.

విద్యార్హత..

అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దాంతో పాటు సంబంధిత బ్రాంచ్‌లో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. జనరల్ కేటగిరీ దరఖాస్తు రుసుము రూ. 500 చెల్లించాలి. అయితే SC, ST కేటగిరీలు దరఖాస్తు రుసుము 250 రూపాయలు డిపాజిట్ చేయాలి.

అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల కోసం ఎంపిక ప్రక్రియ CBT 1, CTT 2 ద్వారా జరుగనుంది. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం, అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ జారీ చేసిన ప్రకటనను తనిఖీ చేయవచ్చు.



Source link

Related posts

వర్షాకాలం Water heater వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Oknews

ఒత్తిడికి కారణాలేంటో తెలుసా .. ఎలా తగ్గించుకోవాలి…?

Oknews

మీ ఇంటికి క్లాసీ లుక్ ఇవ్వాలనుకుంటున్నారా.. ఈ ట్రెండీ ఐడియాలను ప్రయత్నించండి..

Oknews

Leave a Comment