Top Stories

రోజాకు సీనియ‌ర్ హీరోయిన్ల నుంచి అనూహ్య మ‌ద్ద‌తు


మంత్రి ఆర్కే రోజాకు సీనియ‌ర్ హీరోయిన్ల నుంచి అనూహ్య మద్ద‌తు ల‌భిస్తోంది. మంత్రి రోజాపై మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత బండారు స‌త్య‌నారాయ‌ణ నీచ‌మైన కామెంట్స్ రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. బండారుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సీనియ‌ర్ న‌టి కూడా అయిన రోజాకు స‌హ‌చ‌ర హీరోయిన్ల నుంచి మ‌ద్ద‌తు ల‌భించ‌డం విశేషం.

మొద‌ట సీనియ‌ర్ హీరోయిన్‌, జాతీయ మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యురాలు ఖ‌ష్బూ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అస‌లు బండారు మ‌నిషేనా? అని ఆమె ప్ర‌శ్నించారు. రోజాకు క్ష‌మాప‌ణ చెప్పే వ‌ర‌కూ త‌న పోరాటం సాగిస్తాన‌ని ఆమె ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ రాధికా తీవ్ర‌స్థాయిలో స్పందించారు. ఇంట్లో నువ్వు లేన‌ప్పుడు ఏం జ‌రుగుతుందో తెలుసా? అని బండారును ప్ర‌శ్నించారు.

అలాగే సీనియ‌ర్ న‌టి, లోక్‌స‌భ స‌భ్యురాలు న‌వనీత్ కౌర్‌, తాజాగా మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ మీనా ఘాటుగా స్పందించారు. రోజాకు త‌క్ష‌ణ‌మే బండారు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఆమె డిమాండ్ చేశారు. బండారుపై సుప్రీంకోర్టు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె కోరారు. రోజాకు సీనియ‌ర్ న‌టి క‌విత కూడా మ‌ద్ద‌తుగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. 

రోజాపై బండారు అభ్యంత‌ర‌కర వ్యాఖ్య‌లు టీడీపీకి రాజ‌కీయంగా న‌ష్టం క‌లిగించేలా ఉన్నాయి. బండారు కామెంట్స్ స‌భ్య స‌మాజం సిగ్గుప‌డేలా ఉన్నాయ‌నేది ప్ర‌తి ఒక్క‌రి అభిప్రాయం.



Source link

Related posts

అన్న ప్రభుత్వం మీద విశాఖలో తొలి నిరసన…!

Oknews

నోటి దురుసుతో సిటింగ్ సీటు పోగొట్టుకున్న డిప్యూటీ సీఎం

Oknews

పోర్న్ సైట్స్ లో జాన్వి కపూర్.. స్పందించిన హీరోయిన్

Oknews

Leave a Comment