EntertainmentLatest News

లారెన్స్‌ ప్రాజెక్ట్‌ నుంచి నయనతార ఔట్‌! 



లేడీ సూపర్ స్టార్ ఇమేజ్‌తో సౌతిండియా అగ్ర హీరోయిన్ రేంజ్‌కి చేరుకున్న నయనతార పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్‌గా ఆమె కథానాయికగా నటించిన జవాన్ సినిమా ఎంతటి సెన్సేషనల్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్క్రిప్ట్ బావుంటే నయన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఈ సొగసరి ఓ సినిమా నుంచి డ్రాప్ అయ్యింది. ఆ హీరోతో నటించనని చెప్పేసింది. ఇంతకీ నయనతార నటించను అని చెప్పిన హీరో ఎవరు? ఎందుకు ఆమె సినిమా నుంచి డ్రాప్ అయ్యిందనే వివరాల్లోకి వెళితే..

స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉండే అగ్ర దర్శకులు వారికి నచ్చిన కథలను తెరకెక్కించటానికి నిర్మాతలుగా మారుతున్నారు. ఇలా నిర్మాతలుగా మారి వైవిధ్యమైన సినిమాలు చేసిన, చేస్తోన్న దర్శకుల లిస్టులో ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ చేరబోతున్నారు. ఆయనెవరో కాదు.. లోకేష్ కనగరాజ్. తన దర్శకత్వ శాఖలో పని చేస్తోన్న రత్నరాజ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ హారర్ మూవీని ప్లాన్ చేశారు. ఈ మూవీలో స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ అయిన రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో ముందుగా నయనతారను హీరోయిన్‌గా అనుకున్నారు. ఆమె కూడా నటించటానికి ఓకే అన్నారు. అయితే ప్రస్తుత సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్ మేరకు ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.

ఒప్పుకున్న సినిమా నుంచి ఓ స్టార్ హీరోయిన్ తప్పుకుందంటే.. తప్పని పరిస్థితులే కారణంగా ఉంటాయి. మరి ఆ పరిస్థితులేంటనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే నయనతార డ్రాప్ కావటంతో ఇప్పుడు మేకర్స్ మరో హీరోయిన్‌ను వెతుక్కునే పనిలో పడ్డారట. సాదారణంగా నయనతార యాక్ట్ చేయాలంటే ఐదారు కోట్లకుపైగానే రెమ్యూనరేషన్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాదండోయ్ ఎలాంటి ప్రమోషన్స్‌కి రానని ఆమె కండీషన్ పెడుతుంది. అందుకు ఒప్పుకుంటనే ఆమె సినిమాలో యాక్ట్ చేయటానికి ఒప్పుకుంటుంది. మరిప్పుడు ఆమె స్థానాన్ని రీప్లేస్ చేయబోయే దెవరో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.



Source link

Related posts

పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా ధర్నా చేస్తాం.!

Oknews

ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్.. మధ్యలో వెంకీ మామ!

Oknews

treirb has released gurukula degree lecturers dl final results check here

Oknews

Leave a Comment