Telangana

లోక్ సభ ఎన్నికలపై స్పీడ్ పెంచిన కాంగ్రెస్,బీజేపీ- సైలెంట్ మోడ్ లోనే గులాబీ పార్టీ-hyderabad news in telugu congress bjp high commands in process to select mp candidates brs in silent mode ,తెలంగాణ న్యూస్



దిల్లీలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశంమరోవైపు ఇవాళ హస్తినలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ,ఈటల రాజేందర్ సహా ఇతర కీలక నేతలు హాజరు కానున్నారు. మరికొన్ని నెలల్లో జరుగనున్న లోక్ సభ ఎన్నికలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో నేతలు చర్చించనున్నారు. టికెట్ల కోసం పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర నేతలకు అధిష్టానం ఎలాంటి దిశా నిర్దేశం చేయబోతున్నదనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ భేటీ తర్వాత రాష్ట్రంలో సగం లోక్ సభ సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. పార్టీ బలంగా ఉన్న చోట, ఇబ్బందులు లేని నియోజికవర్గాల్లో వీలైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేయడం ఉత్తమమని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారట. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన నాలుగు ఎంపీ సీట్లలో మూడింట్లో (ఆదిలాబాద్ మినహా) సిట్టింగ్ ఎంపీలనే బరిలోకి దింపాలని పార్టీ యోచిస్తోంది. ప్రస్తుతం హై కమండ్ వద్ద ఒక్కో నియోజకవర్గం నుంచి ఆశావహులకు సంబంధించి ముగ్గురు పేర్లతో కూడిన ఒక జాబితా సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. అన్ని కుదిరితే ఇవాళ లేదంటే మార్చి రెండో వారంలో అభ్యర్థులను అనౌన్స్ చేసేందుకు బీజేపీ హై కమాండ్ సిద్దంగా ఉన్నట్లు సమాచారం. తీవ్రమైన పోటీ ఉన్న మల్కాజిగిరి, మహబూబ్ నగర్ స్థానాల్లో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతున్న అంశం. దీంతో ఈసారి టికెట్ల విషయంలో ఎవరు తగ్గుతారు ఎవరు నెగ్గుతారు అనేది రాజకీయ వర్గాల్లో ఇంటరెస్టింగ్ గా మారింది.



Source link

Related posts

Fake Naxalites: మావోయిస్ట్ దళ కమాండర్ పేరున బెదిరింపులు, ఇద్దరు నకిలీ నక్సలైట్ల అరెస్ట్

Oknews

నేటితో ముగియనున్న ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు.. పొడిగింపు లేదంటున్న పోలీసులు-the concession period of traffic challans which will end today no more extension ,తెలంగాణ న్యూస్

Oknews

టెలిగ్రామ్ యాప్ లో పరిచయం, పెట్టుబడి పేరుతో రూ.50 లక్షలు మోసం-దర్యాప్తు దుబాయ్ వరకూ!-hyderabad crime news in telugu woman cheats high profit from investment ts police arrested three ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment