దిశ, ఫీచర్స్ : మనుషులు ఈ భూమిపై జీవించగలిగే సగటు వయస్సు ఒకప్పుడు వందేళ్లుగా చెప్పేవారు. ప్రస్తుతం అలాంటి గ్యారెంటీ ఏమీ లేదు. 60 ఏళ్లు దాటాక ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. కానీ వందేళ్లకంటే ఎక్కువకాలం జీవించగలిగే ఒక గొప్ప అవకాశాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందుకోసం పెద్దగా ఖర్చు కూడా చేయనవసరం లేదు. కాకపోతే మీకు కొంచెం ధైర్యం ఉంటే చాలు. మీ ఆయుష్షును పెంచుకునే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు.
మెరుపులు మెరిసే సమయంలో..
వర్షం పడుతున్నప్పుడు ఉరుములు, మెరుపులు వస్తుంటాయి. ఈ సమయంలో చాలామంది బయటకు వెళ్లడానికి భయపడతారు. కానీ సరిగ్గా మెరుపు మెరుస్తున్న సమయంలోనే మీరు వర్షపు నీటిలో తడవడంవల్ల జీవన మనుగడ అవకాశాలు 90% పెరుగుతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే మెరుపు తుఫానులో మొదటిసారి మెరుపు చాలా పవర్ ఫుల్ కాబట్టి ఆ సందర్భంలో పిడుగులు పడే అవకాశం ఉంటుంది. అందుకని ఫస్ట్ మెరుపు సమయంలో బయట అడుగు పెట్టకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆ తర్వాత వచ్చే మెరుపుల వర్షంలో తడవడానికి ప్రయత్నించవచ్చు.
ఎవిడెన్స్ ఏమిటి?
అధ్యయనంలో భాగంగా జర్మనీలోని ఇల్మెనౌ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఇంజనీర్ రెనే మాచ్‌ట్స్ నేతృత్వంలోని బృందం అనేక పరిశోధనలు చేసింది. ‘మానవ తలపై మా ప్రయోగాలు వర్షం అనేది డ్రై స్కిన్ కంటే మెరుగైన మెరుపునకు గురికావడంవల్ల అది ప్రొటెక్టివ్ బిహేవియర్‌ను కలిగి ఉండవచ్చు అనే థియరీకి ఆచరణాత్మక సాక్ష్యాలను అందిస్తుంది’’ అని పరిశోధకులు పేర్కొన్నారు.
ప్రయోగంలో తేలిందేమిటి?
వాస్తవానికి మెరుపులు ప్రమాదకరమైనవి. ఇవి 200 కిలోయాంపియర్స్ కంటే ఎక్కువ విద్యుత్ ప్రవాహాలను కలిగి ఉంటాయి. అవి మానవులపై ప్రాణాంతకమైన థ్రెషోల్డ్ కంటే ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తాయి. కానీ పరిశోధకుడు మాచ్‌ట్స్ (Machts) నేతృత్వంలోని సైంటిస్టులు మానవ తలపై మెరుపు మెరుపు ఎలా ప్రభావితం చేస్తుందో అన్వేషించడానికి పరిశోధనలు నిర్వహించారు. ఇందులో భాగంగా వారు నిజమైన మానవ పుర్రెల యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ లక్షణాలను ప్రతిబింబించేలా రూపొందించిన రెండు కృత్రిమ మానవ తలలను ఉపయోగించారు.
పరిశోధకులు ఎలా తెలుసుకున్నారు?
పరిశోధకులు రూపొందించిన సింథటిక్ తలలు సిటీ స్కాన్ డేటా ఆధారంగా స్కాల్ప్, స్కల్ అండ్ ఇంటర్నల్ టిష్యూ వాల్యూమ్‌తో సూక్ష్మంగా రూపొందించారు. మానవ కణజాల లక్షణాలను అనుకరించడానికి సోడియం క్లోరైడ్, నీరు, గ్రాఫైట్, అగరోజ్ వంటి జాగ్రత్తగా ఎంపిక చేయబడిన పదార్థాలు ఉపయోగించారు. తదుపరి దశలో సింథటిక్ హెడ్‌లను ఎలక్ట్రోడ్ శ్రేణులపై ఉంచడాన్ని పరిశీలించారు. ఒక తల పొడిగా ఉంది. మరొకటి తడి చర్మ పరిస్థితులను అనుకరించడానికి కృత్రిమ వర్షపు నీటితో స్ప్రే చేశారు.
తలలో పల్స్ జనరేట్ పరిశీలన
శాస్త్రవేత్తలు రూపొందించిన రెండు కృత్రిమ తలలు పల్స్ జనరేటర్ నుంచి లభించే మాగ్జిమమ్ కరెంట్‌కు లోబడి ఉండేలా 42 కిలోయాంపియర్స్ వద్ద సెట్ చేయబడ్డాయి. ఈ ప్రయోగాత్మక సెటప్ మానవ తలతో ఇంటరాక్టింగ్ చేసినప్పుడు బిహేవియర్‌ను ఉపరితల తేమ ఎలా ప్రభావితం చేస్తుందో పరిశోధకులు విశ్లేషించారు. కాగా ఈ సందర్భంగా తడిగా ఉన్నటువంటి తల, పొడిగా ఉన్నదాని కంటే తక్కువ గాయాలను స్వీకరించింది. ఈ సందర్భంలో శాస్త్రవేత్తలు తలపై ‘సర్ఫేస్ ఫ్లాష్ ఓవర్’ అని పిలవబడే పరిస్థితిని ఎనలైజ్ చేశారు.
ఎందుకని ఆయుష్షు పెరుగుతుంది?
వాస్తవానికి సర్ఫేస్ ఫ్లాష్ ఓవర్ అనేది శరీరం అంతటా కరెంట్ యొక్క ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ మధ్య గల అధిక వోల్టేజ్ వ్యత్యాసాల కారణంగా చర్మం ఉపరితలంపై జరిగే మార్పునకు సంబంధించిన ప్రక్రియ. ఈ సందర్భంగా తడిగా ఉన్నటువంటి తల ద్వారా శరీరంలోకి తక్కువ కరెంట్ ప్రవేశించిందని పరిశోధకులు కనుగొన్నారు. మెదడు కుహరంలోకి ప్రవేశించిన శక్తి పొడి తలభాగం కంటే, తడి తల భాగంపై 32.5 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మెదడుకు తగ్గిన కరెంట్ ఎక్స్‌పోజర్ మనుగడ రేటును 70 నుంచి 90 శాతం వరకు పెంచుతుందని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు.