సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి చాలా సహజం. ఒక హీరో, హీరోయిన్ కలిసి కొన్ని సినిమాల్లో నటించారంటే వారి మధ్య ఏదో ఉందనే వార్త బయటికి వచ్చేస్తుంది. అది నిజమా, కాదా అనేది పక్కన పెడితే ఆ రూమర్ ఎంతో వేగంగా స్ప్రెడ్ అయిపోతుంది. ఒకప్పుడు మీడియా అనేది ఇంతగా విస్తరించి లేదు కాబట్టి ఇలాంటివి సామాన్య ప్రజలకు తెలిసేందుకు చాలా కాలం పట్టేది. కానీ, ఇప్పటి పరిస్థితి వేరు. చీమ చిటుక్కుమంటే.. సోషల్ మీడియాలో దాని గురించి చర్చలు మొదలవుతాయి. అలా పది సంవత్సరాల క్రితమే ఓ జంట గురించి మీడియా కోడై కూసింది. వారెవరో కాదు.. హీరో విశాల్, హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌కుమార్. వీరిద్దరూ కలిసి మగమహారాజు, పందెంకోడి 2 చిత్రాల్లో నటించారు. విశాల్, వరలక్ష్మీ మధ్య ప్రేమాయణం నడుస్తోందని, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారనే వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది. వీరి పెళ్ళికి శరత్‌కుమార్ అభ్యంతరం చెబుతున్నాడని, అయితే అతని రెండో భార్య రాధిక పెళ్లికి ఒప్పించిందని, ఇరు కుటుంబాల అంగీకారంతోనే ఈ పెళ్లి జరగబోతోందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
గత పదేళ్ళుగా జరుగుతున్న ఈ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టింది వరలక్ష్మీ. ముంబైకి చెందిన వ్యాపారవేత్త నికోలాయ్ సచ్‌దేవ్‌తో ఆమె పెళ్లి జరగబోతోంది. ఇటీవల వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ సంవత్సరమే పెళ్ళి కూడా ఉంటుందని వరలక్ష్మీ ప్రకటించింది. గత కొన్నేళ్ళుగా వరలక్ష్మీ ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ విశాల్‌ని పక్కనపెట్టి మరొకరిని పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అవ్వడం వెనుక బలమైన కారణమే ఉంది అంటున్నారు. నడిఘర్ సంఘం నిర్మించే కళ్యాణ మంటపంలో జరిగే తొలి వివాహం విశాల్, వరలక్ష్మీదేనని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అయితే నడిఘర్ సంఘం ఎన్నికల సమయంలో విశాల్, శరత్‌కుమార్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. కొన్ని విషయాల్లో ఇద్దరూ వాదించుకున్నారు, గొడవ పడ్డారు. ఆ కారణంగానే విశాల్, వరలక్ష్మీ విడిపోయారనే వార్త స్ప్రెడ్ అయింది.
ఇప్పుడు వరలక్ష్మీ ఎంగేజ్‌మెంట్ జరిగిన తర్వాత విశాల్ స్పందిస్తూ ‘వరలక్ష్మి పెళ్లి చేసుకుంటోందని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హీరోయిన్‌గా తనేమిటో ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో కృషి చేసింది. తెలుగులో కూడా ఆమె చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె పర్సనల్ లైఫ్‌లో సెటిల్ అవుతున్నందుకు హార్ట్‌ఫుల్ కంగ్రాట్యులేషన్స్’ అన్నారు.