Health Care

వస్తూ వస్తూనే అదృష్టం తెచ్చిన అంబానీ కోడలు!! పెళ్లి తర్వాత రూ.25వేల కోట్ల సంపద!


దిశ, ఫీచర్స్: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహం జూలై 12న ముంబైలోని జియో కాన్వెంట్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు సైతం హాజరై సందడి చేశారు. అయితే ఈ పెళ్లి తర్వాత రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్ అంబానీ సంపద గణనీయంగా పెరిగింది. పెళ్లికి రూ. 5000 కోట్లు ఖర్చు చేసినా ముఖేష్ అంబానీ సంపద ఏమాత్రం తగ్గకుండా.. అంతకు ఐదింతలు పెరిగింది. పెళ్లి తర్వాత అంబానీ నెట్‌వర్త్‌ రూ.25,000 కోట్లు (3 బిలియన్‌ డాలర్లు) పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం జూలై 5న అంబానీ నెట్‌వర్త్‌ 118 బిలియన్ డాలర్లు కాగా జూలై 12 నాటికి ఇది 121 బిలియన్ డాలర్లకు పెరిగింది.

ఈ పెరుగుదల కారణంగా ప్రపంచ సంపద ర్యాంకింగ్స్‌లో ముఖేష్ అంబానీ స్థానాన్ని పెంచింది. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో అంబానీ స్థానం 12 నుంచి 11వ స్థానానికి చేరారు. అయితే అంబానీ నెట్‌వర్త్‌ పెరగడానికి కొత్త కోడలు వచ్చిన వేళావిశేషమనే అంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.



Source link

Related posts

పురాతన తవ్వకాల్లో బయటపడ్డ వింత వస్తువు..చివరికి

Oknews

స్నానం చేస్తున్నప్పుడు యూరిన్ చేస్తున్నారా? కానీ ఎవరితో చెప్పుకోలేక పోతున్నారా?

Oknews

అక్కడి మహిళలు పెళ్లి కాకుండానే పిల్లల్ని కనొచ్చు.. అత్యంత సురక్షితమైన దేశం కూడా అదే

Oknews

Leave a Comment