EntertainmentLatest News

వాలెంటైన్స్ డే రోజు సిద్దార్ధ్ సినిమా రీ రిలీజ్…ఆర్ఆర్ఆర్ నిర్మాత కూడా  


తెలుగు సినిమా రంగంలో ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఆ మాట కొస్తే తెలుగు సినిమా పుట్టినప్పటి  దగ్గరనుంచి రీ  రిలీజ్ ట్రెండ్ ఉంది. కాకపోతే ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత పాత సినిమాలు విడుదల అవుతున్నాయంతే. ఇక ఇందులో  పెద్ద ఆశ్చర్యం ఏంటంటే మొదటి సారి రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకాదరణకి నోచుకోని సినిమాలు రీ రిలీజ్ లో  బాగున్నాయనే టాక్ ని సంపాదిస్తున్నాయి.  తాజాగా సిద్దార్ధ్ సినిమా ఒకటి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

 సిద్దార్ధ్ హీరోగా నటించిన ఎన్నో సినిమాల్లో ఓయ్ కూడా ఒకటి. 2009 జులై మొదటి వారంలో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే స్పెషల్‌గా మరోసారి విడుదల కాబోతుంది. మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి ఒక భయకంరమైన వ్యాధి ఉందని త్వరలోనే ఆ అమ్మాయి చనిపోతుందని తెలిస్తే అప్పుడు ఆ ప్రేమించిన హృదయం ఎంత క్షోభ అనుభవిస్తుందో సినిమాలో చాలా చక్కగా చూపించారు. ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఓయ్  అప్పట్లో ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ అవ్వలేదు. కానీ సినిమా మాత్రం చాలా స్టైల్ గా ఉంటుంది. సాంగ్స్ కూడా సూపర్ గా ఉంటాయి. 

సిద్దార్ధ్ సరసన బేబీ షామిలి నటించిన ఈ మూవీని  ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్  దానయ్య  ఆ రోజుల్లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించాడు. సునీల్, అలీ, నెపోలియన్, ప్రదీప్ రావత్, కృష్ణుడు తదితరులు కీలక పాత్రలు పోషించగా  యువన్ శంకర్ రాజా సంగీతాన్ని  అందించాడు. ఆనంద్ రంగ దర్శకత్వంలో ఓయ్ తెరకెక్కింది. ఒకప్పుడు తెలుగు నాట సిద్దార్ద్ సినిమాలకి మంచి క్రేజ్ ఉండేది. ఎన్నో మంచి చిత్రాలు ఆయన నుండి వచ్చి ప్రేక్షకులని అలరించాయి. మరి ఇప్పుడు రీ రిలీజ్ అవుతున్న ఓయ్ ఎంతవరకు ప్రేక్షకాదరణకి నోచుకుంటుందో చూడాలి.

 



Source link

Related posts

సాయితేజ్‌ తన పెళ్లి విషయంలో షాక్‌ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడా?

Oknews

టీ గ్లాస్ తో తుఫాన్ సృష్టించడానికి వస్తున్న పవర్ స్టార్!

Oknews

నా జీవితంలో మరచిపోలేని సమయం ఇది, అల్లు అర్జున్ భావోద్వేగం

Oknews

Leave a Comment