Health Care

వాలెంటైన్స్ డే వెనుక క్రూరమైన ఆచారాలు.. 14th వస్తే ఆ మహిళలకు నరకమే


దిశ, ఫీచర్స్ : ప్రేమికుల రోజు అనగానే అందరికీ లవర్స్ గుర్తు వస్తుంటారు. ప్రేమికులు వారం రోజుల పాటు ,ప్రతీ రోజును ఓ స్పెషల్ డే గడుపుకుంటూ ఆనందంగా ఉంటారు.అయితే ఈ ప్రేమికుల రోజు ఎలా పుట్టింది. అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే దీనికి చాలా చరిత్ర ఉందంట. ఫిబ్రవరి మధ్యలో రోమన్లు లుపర్‌కాలియా అనే వేడుక చేసుకునేవాళ్లు. అది వారికి వసంతకాలం.ఈ వేడుకల్లో భాగంగా ఒక్కో కాగితంపై ఒక్కో అమ్మాయి పేరు రాసి వాటిని ఒక బాక్సులో వేసేవారు.

తర్వాత అబ్బాయిలు వచ్చి ఆ బాక్సులోంచి చిటీలు తీసేవారు. ఆ స్లిప్‌లో ఏ అమ్మాయి పేరైతే ఉంటుందో ఆ అమ్మాయి ఆ ఫెస్టివల్‌లో అతనికి ప్రేయసిగా ఉండాలి. ఇలాంటి జంటలు కొన్నిసార్లు పెళ్లి కూడా చేసుకునే వాళ్లు.ఈ రోమన్ల సంప్రదాయం నుంచే వాలెంటైన్స్ డే వచ్చిందని భావిస్తున్నారు.

  • అయితే వాలెంటైన్స్ డే అంటే పెళ్లీలు, ప్రేమ, జంటల మధ్య సంతోషమే కాకుండా, ప్రేమికుల రోజు వెనుక కొన్ని క్రూరమైన ఆచారాలు ఉండేవంట.
  • వాలెంటైన్స్ డే వెనుక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రేమికుల రోజు సమయంలో సంతానోత్పత్తి పెంచడానికి మహిళలను వీపుపై కొరడాతో కొట్టేవారంట. ఓక్కోసారి దీనివలన కొందరు చనిపోయేవారంట. కొందరు పురుషులు మహిళల పట్ల క్రూరంగా ప్రవర్తించడంతో ఐదవ శతాబ్ధంలో దీన్ని నిషేధించారంట.
  • రోమన్లు ​​ఫిబ్రవరి మధ్యలో లుపెర్కాలియా అనే వేడుక నిర్వహించుకునేవారని అంటారు. ఈ సందర్భంగా విపరీతంగా మద్యపానం చేసేవారు. రోడ్ల మీద తాగి తూగే వారు.



Source link

Related posts

దిండు వేసుకునా లేక దిండు లేకుండా పడుకుంటే లాభాలా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Oknews

వర్షాకాలంలో ఒళ్లు.. కీళ్ల నొప్పులు ఎక్కువ.. కారణం ఇదే

Oknews

ఈ వీడియో చూశారా?.. నడిరోడ్డుపై ఓ మహిళ చేసిన పనికి అందరూ ఎలా రియాక్ట్ అయ్యారో..!

Oknews

Leave a Comment