Top Stories

వాళ్లిద్ద‌రిపై చాకిరేవు!


ఇటీవ‌ల కాలంలో సీపీఐ నాయ‌కులు నారాయ‌ణ‌, రామ‌కృష్ణ అభాసుపాలు అయ్యారు. క‌మ్యూనిస్టు సిద్ధాంతాల్ని వ‌దిలి, చంద్ర‌బాబుని భుజాన వేసుకోవ‌డంతో వాళ్లిద్ద‌రు తీవ్ర విమ‌ర్శ‌ల‌పాల‌య్యారు. అయినా వాళ్ల‌లో మార్పు రావ‌డం లేదు. త‌మ పార్టీ సిద్ధాంతాల‌కు అనుగుణంగా పేద‌ల కోసం ప‌ని చేయ‌డం మానేసి, పెత్తందారులు, పెట్టుబ‌డీదారుల ప్ర‌యోజ‌నాల కోసం సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె.నారాయ‌ణ‌, రాష్ట్ర కార్య‌ద‌ర్శి కె.రామ‌కృష్ణ అవిశ్రాంత పోరాటం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో వాళ్లిద్ద‌రినీ నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో చాకిరేవు పెడుతున్నారు. అవినీతి కేసులో చంద్ర‌బాబు అరెస్ట్ అయితే, ఆయ‌న కోసం నిస్సిగ్గుగా నారాయ‌ణ‌, రామ‌కృష్ణ టీడీపీతో జ‌త‌క‌ట్ట‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌పాలైంది. బాబుకు సంఘీభావంగా రామ‌కృష్ణ‌, నారాయ‌ణ రోడ్డెక్క‌డం అంటే కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అవ‌మానించ‌డంగా పార్టీ సానుభూతిప‌రులు చెబుతున్నారు. సీపీఐ నాయ‌కులు నారాయ‌ణ‌, రామ‌కృష్ణ తీరుపై సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న పోస్టు గురించి తెలుసుకుందాం.

"చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని సైకో పోవాలని, సైకిల్ రావాలని నేటి 'కాంతితోనే రేపటి క్రాంతి' సాధ్యమని నమ్ముతూ మార్క్స్, ఏంగెల్స్ లక్ష్యాల సాధన కోసం నారాయణ, రామకృష్ణల‌ విప్లవ మార్గంలో పయనిస్తూ కమ్యూనిజం పత్రిక చేత బూని తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి దీపాలు వెలిగించిన, మొబైల్ ఫ్లాష్ లైట్లు విరజిమ్మిన సీపీఐ కార్యకర్తలు!ఆంధ్రప్రదేశ్ పెత్తందారుల, కబ్జాదారుల ఐక్యత వర్ధిల్లాలి" అంటూ సీపీఐ తీరుపై క‌మ్యూనిస్టు సానుభూతిప‌రులు ఆవేద‌న‌తో కూడిన పోస్టు పెట్ట‌డం గ‌మ‌నార్హం.

"ఆధునిక " క‌మ్మ‌" నిస్టుల నాయ‌క‌త్వంలో దోపిడీ స‌మాజాన్ని నిర్మిద్దాం, నారాయ‌ణ‌, రామ‌కృష్ణ‌ల ఆశ‌య సాధ‌న కోసం పోరాడుదాం" అంటూ సోష‌ల్ మీడియాలో నినాదాలు వెల్లువెత్తుతున్నాయి. "అవినీతి కేసులో జైలుపాలైన చంద్ర‌బాబు కోసం పోరాడితే పోయేదేం లేదు…క‌మ్యూనిజం ప‌రువు త‌ప్ప" అని వాళ్లిద్ద‌రికి చుర‌క‌లు అంటిస్తున్నారు. "సీపీఐలో నారాయ‌ణ‌, రామ‌కృష్ణ‌లకు చోటు… స‌మాజానికి చేటు. మార్క్స్ మ‌హానుభావుడా చ‌చ్చి బ‌తికిపోయావు. లేదంటే వీళ్లిద్ద‌రిని చూసి ఆత్మ‌హ‌త్య చేసుకునేవాడివి" అంటూ తీవ్ర‌స్థాయిలో నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు. 



Source link

Related posts

గులాబీ తొడిమ మాత్రమే మిగులుతుందా?

Oknews

‘మెగా’ పద్మ విభూషణుడు..మన ‘చిరు’

Oknews

గుంటూరులో యాసిడ్ దాడి.. కానీ సీన్ రివర్స్

Oknews

Leave a Comment