EntertainmentLatest News

వాష్ రూమ్ కి వెళ్లలేదన్నది నిజం.. అలా బతకడం ఎప్పుడో మానేశా 


2006 లో ఫోటో అనే మూవీతో తెలుగు  సినీ రంగ ప్రవేశం చేసిన అచ్చ తెలుగు నటి అంజలి(anjali)ఆ తర్వాత తమిళంలో పధ్నాలుగు  సినిమాల దాకా చేసి  2013 లో మహేష్ బాబు(mahesh babu) వెంకటేష్(venkatesh)హీరోలుగా వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ద్వారా తెలుగు రీ ఎంట్రీ ఇచ్చింది. ఇవ్వడమే కాదు వరుస పెట్టి సినిమాలు చేస్తు తెలుగు నాట తన సత్తా చాటుతుంది. రీసెంట్ గా ఆమె చెప్పిన కొన్ని విషయాలు  సోషల్ మీడియాలో వైరల్ గా నిలుస్తున్నాయి.

అంజలి రీసెంట్ గా బహిష్కరణ(bahishkarana)అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొన్న జులై 19 న  జీ 5 వేదికగా స్ట్రీమింగ్ కి రాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తుంది.  క్రైమ్ డ్రామాగా తెరకెక్కగా అంజలి నే మెయిన్ రోల్. ఇక ఇందులో మునుపెన్నడూ లేని విధంగా  ఇంటిమెంట్ సీన్స్ లో అంజలి వీర విహారం చేసింది. ఇంటిమెంట్ సీన్స్ అంటే హద్దులు లేని రొమాన్స్. ఇప్పుడు ఈ విషయంపైనే అంజలి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ఇంటిమెంట్ సీన్స్ చేసేటప్పుడు అందర్నీ బయటకి పంపి చిత్రీకరించడం జరిగింది. నిజానికీ ఆ సీన్స్ చేసేటప్పుడు చాలా గందరగోళానికి గురయ్యాను. పైగా ఇప్పటి వరకు అలాంటివి చెయ్యలేదు. నా పాత్ర బాగా రావడం కోసం చాలా  కృషి చేసానని చెప్పుకొచ్చింది. అలాగే గతంలో కూడా  నవరస అనే సిరీస్ చేసేటపుడు కొన్ని గంటల పాటు వాష్ రూమ్ కి కూడా వెళ్లలేదని చెప్పింది.

ఇంకొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. నా గురించి  సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ గురించి అసలు పట్టించుకోను. ఎవరైనా  తప్పుగా రాస్తే ముందు బాధపడతాను. ఆ తర్వాత వెంటనే మర్చిపోతాను. అలాగే ఇతరుల కోసం పనులు చెయ్యడం ఎప్పుడో మానేసానని  కూడా వెల్లడించింది.

 



Source link

Related posts

High Court Big Shock To Actor Navdeep నవదీప్ కి కోర్టు బిగ్ షాక్

Oknews

Medaram Sammakka Sarakka Fest : కాకతీయులతో యుద్ధంలో సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు చనిపోయారా? నిజమెంత?

Oknews

Balanagar news large number of ganja chocolates were seized in Hyderabad

Oknews

Leave a Comment