“నిన్న రామభద్రపురం పీఎస్ పరిధిలో ఓ దారుణ ఘటన జరిగింది. నిన్న మార్నింగ్ తన ఆరు నెలల చిన్నారికి స్నానం చేయించి ఉయ్యాలలో పడుకోబెట్టి పక్కన కిరాణా షాపునకు వెళ్లింది. ఆమె బయటకు వెళ్లగానే, తనకు బాబాయ్ వరసయ్యే ఎరుకన్న దొర అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లాడు. షాపులో వస్తున్న తీసుకుంటుండగా… పక్కింటి వాళ్లు పిల్ల ఏడుస్తుందని ఆమెతో చెప్పారు. దీంతో తన ఉన్న పెద్దమ్మాయిని చెల్లి ఏడుస్తుందని చూడు అని పంపింది. పెద్దమ్మాయి ఇంట్లోకి వెళ్లి చూసే సరికి ఎరుకన్న దొర చేతిలో పాప ఉంది. చిన్నారి ప్రైవేట్ పార్ట్ నుంచి కాస్త బ్లెడ్ వస్తుంది. ఈ విషయాన్ని పెద్దమ్మాయి తల్లికి చెప్పింది. దీంతో వెంటనే తల్లి అక్కడకు వచ్చింది. చిన్నారిని ఎరుకన్న ఉయ్యాలలో వేసి పారిపోయాడు. తల్లి చిన్నారిని తీసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చింది. కొత్త చట్టం బీఎన్ఎస్ కింద, పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశాం. ఎస్పీ ఆదేశాలతో ముందు చిన్నారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇవాళ ఉదయం ఎరుకన్న దొరను అరెస్టు చేశాం. అతడి దుస్తులపై బ్లెడ్ ఉంది. వాటిని సీజ్ చేశాం. ముద్దాయిని ఇవాళ కోర్టులో ప్రవేశపెడతాము”- బొబ్బిలి డీఎస్సీ శ్రీనివాసరావు