కోలీవుడ్ స్టార్ విజయ్ కొత్త సినిమా గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడీ ప్రాజెక్టులోకి శృతిహాసన్ వచ్చి చేరింది. అయితే హీరోయిన్ గా కాదు.
గోట్ సినిమాలో ఓ పాట పాడింది శృతిహాసన్. మ్యూజిక్ డైరక్టర్ యువన్ శంకర్ రాజా ఓ ప్రత్యేకమైన పాటను ఆమెతో పాడించాడట. ఆ సాంగ్ ను మరో 10 రోజుల్లో రిలీజ్ చేయబోతున్నారు.
ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు తనకు ఎంతో ఇష్టమైన సింగింగ్ ను కూడా కొనసాగిస్తోంది శృతిహాసన్. ఇందులో భాగంగా ఆమె తాజాగా ఓ సింగిల్ రిలీజ్ చేసింది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో కలిసి చేసిన ఆ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆ ఒరిజినల్ సాంగ్ తర్వాత, మళ్లీ ఇప్పుడు విజయ్ సినిమాలో పాడిన పాటతో ప్రేక్షకుల ముందుకొస్తోంది శృతిహాసన్. ‘గోట్’ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. విజయ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి వస్తోంది.
The post విజయ్ సినిమాలో శృతిహాసన్..! appeared first on Great Andhra.