విటమిన్-సి లోపం తొలగి రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవి..!


posted on Jan 9, 2025 9:30AM

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే చాలా రకాల విటమిన్లు అవసరం అవుతాయి. వాటిలో విటమిన్-సి ముఖ్యమైనది.  విటమిన్-సి శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తుంది.  జబ్బు పడినప్పుడు విటమిన్-సి ఆధారిత పండ్లు, కూరగాయలు తీసుకుంటే చాలా తొందరగా కోలుకుంటారు.  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూడా విటమిన్-సి ఆధారిత పండ్లు, కూరగాయలు బాగా తీసుకుంటే రోగనిరోధక శక్తి బలపడుతుంది.  సాధారణంగా విటమిన్-సి లోపం రావడం అరుదే అయినప్పటికీ..  ఈ లోపం ఏమాత్రం ఉన్నా ఆరోగ్యం తొందరగా దెబ్బతింటుంది. విటమిన్-సి లోపం తొలగాలన్నా,  రోగనిరోధక శక్తి పెరగాలన్నా ఈ కింది సూపర్ ఫుడ్స్ తప్పనిసరిగా తినాలి.

బ్రోకలీ..

బ్రోకలీలో విటమిన్-సి మోతాదు ఎక్కువగా ఉంటుంది.  అలాగే కాల్షియం,  ఫైబర్, పొటాషియం, విటమిన్-ఎ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఉసిరి..

ఉసిరికాయలు విటమిన్-సి కి చాలా మంచి మూలం.  నిమ్మకాయలో ఉండే విటమిన్-సి కంటే 10 రెట్లు విటమిన్-సి  ఉసిరికాయలలో ఉంటుంది.  ఉసిరికాయను పొడి రూపంలో తీసుకున్నా,  జ్యూస్ రూపంలో తీసుకున్నా.. అందుబాటులో ఉన్నప్పుడు నేరుగా రోజూ ఒక కాయను పచ్చిగానే తిన్నా చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది.   రోగనిరోధక శక్తిని బలపరచడమే కాకుండా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. చర్మం మెరిచేలా చేస్తుంది. చర్మ సంబంధ సమస్యలు తొలగిస్తుంది.

నారింజ..

నారింజ సిట్రస్ పండ్లలో ప్రముఖమైనది. నారింజను తినడం వల్ల  రోగనిరోధక శక్తి అద్బుతంగా పెరుగుతుంది.  ప్రతిరోజూ ఒక నారింజ పండు తింటుంటే వృద్దాప్యం త్వరగా రాదట.  జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుందట.  తెల్ల జుట్టు సమస్య అస్సలే ఉండదని ఆహార నిపుణులు అంటున్నారు.  నారింజలో పైబర్,  విటమిన్-ఎ, పొటాషియం, విటమిన్-సి ఉంటాయి.    ఇన్పెక్షన్ ప్రమాదాలు తగ్గించడంలో సహాయపడుతుంది.

క్యాప్సికం..

క్యాప్సికంలో విటమిన్-సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.  ఇందులో విటమిన్-సి,  విటమిన్-ఎ,  బీటా కెరోటిన్ ఉంటాయి.  దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్-సి లోపం తొలగిపోతుంది.  దీన్ని సలాడ్ లలోనూ,  వెజిటబుల్ జ్యూస్ లోనూ జోడించుకోవచ్చు.

బొప్పాయి..

బొప్పాయిలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.  బొప్పాయి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  ఇధి మాత్రమే కాకుండా ఇది శరీరం డిటాక్స్ కావడంలో సహాయపడుతుంది. అంటే.. శరీరంలో ఉన్న వ్యర్థపదార్థాలు, మలినాలు, విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.


                                     *రూపశ్రీ


 



Source link

Leave a Comment