EntertainmentLatest News

‘విడాముయర్చి’ షూటింగ్‌లో విషాదం.. అజిత్‌ ఆత్మీయ ఆర్ట్‌ డైరెక్టర్‌ మృతి!


ఈమధ్యకాలంలో ఎంతోమంది సినీ ప్రముఖులు కన్ను మూశారు. ఇప్పుడు కోలీవుడ్‌ ఇండస్ట్రీకి మరో విషాదం నెలకొంది. అజిత్‌ హీరోగా నటిస్తున్న ‘విడాముయర్చి’ షూటింగ్‌లో అజిత్‌కి ఎంతో ఆత్మీయుడైన ఆర్ట్‌ డైరెక్టర్‌ మిలన్‌ గుండెపోటుతో మరణించారు. ఈ సినిమాకి ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మిలన్‌.. ఈ సినిమా షూటింగ్‌ కోసం అజర్‌బైజాన్‌లో ఉన్నారు. అక్కడ గుండెపోటుకు గురయ్యారు. తెల్లవారుజామున గుండెల్లో నొప్పిగా ఉందని యూనిట్‌ సభ్యులతో చెప్పడంతో వెంటనే ఆయన్ని సమీపంలోని హాస్పిటల్‌కి తరలిస్తుండగా దారిలోనే తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. 

2006లో విడుదలైన ‘గలాబా కాదలన్‌’ చిత్రం ద్వారా ఆర్ట్‌ డైరెక్టర్‌గా పరిచయమైన మిలన్‌.. ఆ తర్వాత అజిత్‌ హీరోగా నటించిన వేలాయుధం, వీరమ్‌, రజనీకాంత్‌ అన్నాత్తై చిత్రాలకు పనిచేశారు. అజిత్‌కు ఎంతో ఇష్టమైన ఆర్ట్‌ డైరెక్టర్‌ మిలన్‌. అజిత్‌ హీరోగా నటించిన రెండు సినిమాలకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన మిలన్‌కి, అజిత్‌కి మంచి అనుబంధం ఉంది. తన ఆత్మీయుడ్ని కోల్పోవడం పట్ల అజిత్‌ ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నారు. అజిత్‌ చేస్తున్న తాజా చిత్రం ‘విడాముయర్చి’పై భారీ అంచనాలు ఉన్నాయి. విదేశాల్లో షూటింగ్‌ జరుపుకుంటోందన్న వార్త తెలిసిన అభిమానులు ఈ సినిమా అప్‌డేట్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఇలాంటి విషాదకరమైన వార్త వినాల్సి రావడంతో ఎంతో వ్యధకు లోనవుతున్నారు. షూటింగ్‌ కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ ప్రాణాలు విడవడం ఎంతో బాధాకరమైన విషయమని నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. 



Source link

Related posts

చిరుకి ఊపిరి సలపడం లేదు

Oknews

కళ్ళు చెదిరేలా 'స్కంద' బిజినెస్.. బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Oknews

నా గురించి మీకు పూర్తిగా తెలియదు..అందుకేనా మార్షల్ ఆర్ట్స్ 

Oknews

Leave a Comment