EntertainmentLatest News

విడుదలకు ముందే ‘టిల్లు స్క్వేర్’ సంచలనం.. ఓటీటీ రైట్స్ కి అన్ని కోట్లా..!


ఇటీవల కాలంలో చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించిన తెలుగు సినిమాల్లో ‘డీజే టిల్లు’ ఒకటి. 2022 ఫిబ్రవరిలో విడుదలైన ఈ రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఫిల్మ్ రూ.30 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ పంచిన వినోదానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా యువతకి.. ఈ సినిమా, ఇందులోని టిల్లు పాత్ర ఎంతగానో చేరువయ్యాయి. త్వరలో ఈ సినిమాకి సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ రాబోతుంది.

‘డీజే టిల్లు’ ప్రభావంతో ‘టిల్లు స్క్వేర్’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటిదాకా విడుదలైన ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ సినిమా విడుదల తేదీ పలుసార్లు మారినప్పటికీ.. అంచనాలు ఏమాత్రం తగ్గడంలేదు. బిజినెస్ పరంగా కూడా ఈ చిత్రం సంచలనాలు సృష్టిస్తోంది. ‘టిల్లు స్క్వేర్’ ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.35 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఒక కుర్ర హీరో సినిమా ఓటీటీ రైట్స్.. ఈ స్థాయిలో అమ్ముడవ్వడం రికార్డు అని చెప్పవచ్చు. ‘డీజే టిల్లు’కి ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ తోనే.. సీక్వెల్ రైట్స్ రికార్డు ప్రైస్ కి అమ్ముడయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

‘టిల్లు స్క్వేర్’ సినిమా మార్చి 29 విడుదల కానుంది. ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తే.. హీరో సిద్ధు జొన్నలగడ్డ మార్కెట్ ఒక్కసారిగా పెరిగే అవకాశముంది.



Source link

Related posts

దీక్షలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Oknews

జగన్ ఓటమిలో రాజమౌళి కూడా ఒక భాగం

Oknews

TSPSC has released Veterinary Assistant Surgeon Exam results check General Ranking List here

Oknews

Leave a Comment