దిశ, ఫీచర్స్ :
ఎక్స్-రే అనగానే చాలామందికి వెంటనే హాస్పిటల్ గుర్తుకొస్తుంది. ఏవైనా అనారోగ్యాలు చేసినప్పుడు వ్యాధుల నిర్ధారణకు అక్కడ చెస్ట్, హెడ్, బాడీ ఎక్స్‌రేలు సజెష్ చేస్తుంటారు డాక్టర్లు. కానీ ఖగోళ శాస్త్ర పరిభాషలో ఎక్స్-రేకు వేరే అర్థం ఉంది. విశ్వ రహస్యాలను ఛేదించే క్రమంలో సైంటిస్టులు తాము గుర్తించిన కొత్త ప్రదేశాలను, అంతరిక్ష అద్భుతాలను కూడా ఎక్స్- రే తీస్తుంటారు. తాజాగా ‘eROSITA’ అనే జర్మన్ కన్సార్టియం ఈ మొత్తం విశ్వం యొక్క అతిపెద్ద ఎక్స్‌రే మ్యాప్‌ను, దాని వీడియోను విడుదల చేసింది. ఇందులో 9 లక్షలకంటే ఎక్కువ కాస్మిక్ మూలాలు ఉన్నాయి. అలాగే 7,00,000 కంటే ఎక్కువ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ కూడా ఉన్నాయి.
కాంతికి సంబంధించిన ‘సాధారణ’ తరంగదైర్ఘ్యాలలో కనిపించని వస్తువులను శాస్త్రవేత్తలు కాస్మిక్ X-కిరణాల ద్వారా విశ్లేషిస్తారు. ప్రస్తుతం “eROSITA” అనే జర్మన్ కన్సార్టియం రష్యా-జర్మన్ ఉపగ్రహం యొక్క స్పెక్ట్రమ్-ఆర్‌జిపై అమర్చిన ఎరోసిటా ఎక్స్-రే టెలిస్కోప్ ద్వారా సేకరించిన మన విశ్వం యొక్క ఎక్స్- రే డేటాను రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని జర్మనీలోని మాక్స్ ప్లాంక్ సొసైటీ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో షేర్ చేసింది. ‘మొదటి ఆరు నెలల పరిశీలనలో ఈ ఎక్స్-రే ఖగోళ శాస్త్రానికి సంబంధించిన గత 60 సంవత్సరాల చరిత్రలో మనకు తెలిసిన దానికంటే ఎక్కువ విషయాలను తెలియజేసింది’’ అని ది మాక్స్ ప్లాంక్ సొసైటీ పేర్కొన్నది. ఈ విశ్వం యొక్క ఎక్స్-రేలో సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్‌తోపాటు అధిక-శక్తి కాస్మిక్ మూలాలు (9,00,000 కంటే ఎక్కువ) 1,80,000 ఎక్కువగా అద్భుతమైన నక్షత్రాలు కూడా ఉన్నాయి.
An X-ray image of half the #universe: the first publication of the eROSITA sky-survey data release makes public the largest ever catalogue of high-energy cosmic sources 😲 https://t.co/POg5FuVraP @eROSITA_SRG @MPE_Garching pic.twitter.com/X21gnUD6iW
— Max Planck Society (@maxplanckpress) January 31, 2024