Hyderabad News : హైదరాబాద్(Hyderabad) లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు(Software Employees)గా పనిచేస్తున్న స్నేహితులు…..వీకెండ్(Weekend Trip) రావడంతో సరదాగా గడిపేందుకు ఓ రిసార్ట్ కు వెళ్లారు. అక్కడ తోటి స్నేహితులతో కలిసి వీరు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. అర్ధరాత్రి సమయంలో తిరుగు ప్రయాణంలో వేగంగా వెళుతున్న వీరి కారు (Car Accident)అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా….మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ వద్ద చోటు చేసుకుంది. రాజేంద్ర నగర్ ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం….కాకినాడ ప్రాంతానికి చెందిన గౌతం సాయి(24), ఆనంద్ (30), సూర్య తేజ (27), ప్రకాష్(26), తనూజ (25) స్నేహితులు. గచ్చిబౌలి ప్రాంతంలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో వీరంతా ఉద్యోగం చేస్తున్నారు. శనివారం, ఆదివారం వీకెండ్ హాలిడేస్ కావడంతో…. సూర్య తేజ తన కారులో గౌతం సాయి, ఆనంద్, ప్రకాష్, తనూజలను తీసుకొని శంషాబాద్ ప్రాంతంలోని రిసార్ట్ వెళ్లారు.
Source link
previous post