Health Care

వీటిని అసలు మీ ముఖంపై అప్లై చేయోద్దు.. ఎందుకంటే..?


దిశ, ఫీచర్స్ : ప్రతి ఒక్కరూ ముఖం అందంగా ఉండాలని ఆశ పడుతుంటారు. దీని కోసం ఎన్నో క్రీములు, ఎన్నో పేస్ ప్యాక్ లు వేస్తుంటారు. ముఖం తెల్లగా మార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అమ్మాయిలు, అబ్బాయిలు ముఖాలు అందంగా మార్చడానికి చాలా తప్పులు చేస్తారు. ఈ కారణంగా, ముఖం మీద అలర్జీలు వస్తుంటాయి. కొన్నింటిని, ముఖానికి వాడడం వల్ల అనేక చర్మ సమస్యలు వస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

నిమ్మరసం

కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు నిమ్మరసాన్ని ఫేస్ కి రుద్దుతుంటారు. అయితే, నిమ్మరసం సహజంగా ఆమ్లంగా ఉంటుంది. నిమ్మరసాన్ని నేరుగా అప్లై చేయడం వల్ల మీ చర్మం పొడిబారుతుంది, చికాకు కలిగిస్తుంది. దీని వలన ముఖం ఎరుపుగా మారుతుంది.

వంట సోడా

మీ ముఖానికి బేకింగ్ సోడాను అసలు వాడొద్దు. ఇది చర్మానికి అసలు మంచిది కాదు. దీని వలన దురద సంభవించవచ్చు. కొంతమంది ముఖానికి టూత్‌పేస్ట్‌ను కూడా పెడుతుంటారు. అయితే, ఇది చర్మంపై అప్లై చేసినప్పుడు దద్దుర్లు, ముడతలకు దారితీస్తుంది.

వేడి నీరు

మరిగే నీటితో ముఖాన్ని శుభ్రపరచకండి. వేడి నీరు మీ చర్మాన్ని దెబ్బతీస్తుంది. ఈ నివారణలన్నింటినీ ఉపయోగించడం మానుకోండి. ముఖానికి గాయం అయ్యే ప్రమాదం ఉంది. మీకు అలెర్జీలు ఉంటే మీ వైద్యుడిని సంప్రదించి తీసుకోవాలని చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.



Source link

Related posts

టీ తాగడం వల్ల మగవారికి ఆ సమస్య వస్తుందని తెలుసా?

Oknews

ఎన్ని భాషలున్నా అమ్మ భాష కమ్మదనమే వేరు.. నేడు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం..

Oknews

‘నువ్వు కావాలయ్యా’ సాంగ్‌కు ఏనుగు స్టెప్పులు.. తమన్నాను మించి పోయిందిగా.. (వీడియో)

Oknews

Leave a Comment