EntertainmentLatest News

వెనక్కి చూడనంటున్న విజయ్ దేవరకొండ 


పవన్ కళ్యాణ్ హీరోగా విజృంభించి నటించిన ఖుషి మూవీ చాలా పెద్ద ఘన విజయం సాధించింది.లేటెస్ట్ గా అదే టైటిల్ తో వచ్చిన విజయ్ దేవరకొండ ఖుషి మూవీ అయితే మాత్రం అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచి విజయ్ అభిమానులకు షాక్ ని ఇచ్చింది. చాలా ఏరియాల్లో ఖుషి మూవీ నిర్మాతలకి నష్టాలని మిగిల్చింది. లైగర్ సినిమా పరాజయం తర్వాత విజయ్ ఖుషి సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. కానీ సినిమా మాత్రం చాల దారుణ పరాజయాన్ని మూట గొట్టుకుంది. వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్ ,లైగర్ ఇలా వరుస  హ్యాట్రిక్ ప్లాపుల తర్వాత ఖుషి మూవీ కూడా ప్లాప్ అవ్వడంతో విజయ్ కి ఇంక సినిమాలు రావటం కష్టమేమో అని అందరు భావించారు.కానీ విజయ్ ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలకి తోడు ఇంకో రెండు భారీ సినిమాలని కూడా లైన్ లో పెట్టాడు.

 

విజయ్ దేవరకొండ ఖచ్చితంగా మంచి హీరోనే .కాకపోతే కాలం కలిసి రావటం లేదు.ఎన్నో ఆశలు పెట్టుకొని చేస్తున్న  సినిమాలు వరుసగా ప్లాప్ అవుతూ వస్తన్నాయి. కానీ దేవరకొండకి కొత్త సినిమా ఆఫర్లు ఏ మాత్రం  తగ్గడం లేదు.విజయ్ ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని తో జర్సీ మూవీని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి  దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు.ఆల్రెడీ మూవీ షూటింగ్ కూడా జరుగుతుంది అలాగే తనకి గీత గోవిందం లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాని ఇచ్చిన పరశురామ్ తో ఒక మూవీ కి కమిట్ అయ్యాడు.త్వరలోనే మూవీ టీం షూట్ కి వెళ్లబోతుంది .ఈ మూవీని  దిల్ రాజు  నిర్మిస్తున్నారు .ఈ రెండే కాకుండా ఇంకో రెండు కొత్త చిత్రాలకి  కూడా విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు .తన కెరీర్   స్టార్టింగ్ లో తనతో టాక్సీ వాలా లాంటి డిఫరెంట్ సినిమా తీసి మంచి హిట్ ని అందించిన రాహుల్ సంక్రుత్యన్ తో ఒక మూవీ ఒప్పుకున్నాడు.ఈ  మూవీ మైత్రి మూవీ మేకర్స్ బ్యానేర్ పై తెరకెక్కబోతుంది  అలాగే ఇంకో మూవీ కూడా  దిల్ రాజు  బ్యానర్ లోనే విజయ్ చేషున్నాడు.ఈ మూవీకి డైరెక్టర్ ఎవరనేది ఇంకా తెలియదు.సో విజయ్ వెనక్కితిరిగి చూసుకోకుండా  వరుసగా సినిమాలని  చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. రాబోయే సినిమాలన్నా విజయ్ కి విజయాల్ని అందించాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.



Source link

Related posts

లోక్‌సభ అభ్యర్థిగా రాధిక శరత్‌కుమార్‌.. ఏ పార్టీ నుంచో తెలుసా?

Oknews

చంచల్‌గూడ జైలుకి యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు!

Oknews

CM Revanth Reddy met Adani Davos Meeting | అదానీ తో రేవంత్ సర్కారు ఒప్పందాలపై రాజకీయ రచ్చ | ABP

Oknews

Leave a Comment