EntertainmentLatest News

వేణుస్వామి పూజకు బలైన మరో హీరోయిన్‌!


వేణుస్వామి.. ఈ పేరు తెలియని వారు సినిమా ఇండస్ట్రీలో ఉండరనే చెప్పాలి. ఎందుకంటే ఆయన చెప్పే జాతకాలపైన, జ్యోతిష్యాలపైన విపరీతమైన నమ్మకాలు ఏర్పరుచుకున్నారు సినిమా సెలబ్రిటీలు. ముఖ్యంగా హీరోయిన్లు వేణుస్వామితో పూజలు చేయించుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని ఇప్పటివరకు జరిగిన పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. నాగచైతన్య, సమంత విషయంలో ఆయన చెప్పిన జ్యోతిష్యం నిజం కావడంతో హీరోయిన్లకు ఆయనపై గురి ఏర్పపడింది. అందుకే చాలా మంది నటీమణులు వేణుస్వామితో పూజలు చేయించుకున్నారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా బాగా వైరల్‌ అయ్యాయి. శ్రీలీల, రష్మిక మందన్న, డింపుల్‌ హయతి, నిధి అగర్వాల్‌ వంటి హీరోయిన్స్‌తో పాటు అషు రెడ్డి, ఇనాయ సుల్తానా లాంటి బ్యూటీస్‌ కూడా వేణు స్వామితో పూజలు చేయించుకున్నారు.

సినిమా హీరోల జాతకాల విషయంలో, ఎన్నికల ఫలితాల విషయంలో చెప్పిన కొన్ని విషయాలు వివాదాస్పదం కావడంతో ఇటీవల ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు వేణుస్వామి. ప్రభాస్‌తో సినిమాలు తీస్తే నిర్మాతలకు అధోగతి పడుతుందని, భారీగా నష్టపోతారని చెప్పారు. ఇటీవల జరిగిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో వేణుస్వామి లెక్కలు తారుమారు అయిపోయాయి. ఆయన చెప్పినవి ఏవీ జరగకపోవడంతో.. అతను చెప్పేవన్నీ అబద్ధాలని, అతని మాటలు ఎవరూ నమ్మొద్దని నెటిజన్లు కామెంట్‌ చేశారు. అలా ఆయన్ని విపరీతంగా ట్రోల్‌ చెయ్యడంతో ‘ఇకపై రాజకీయాల గురించి జ్యోతిష్యం చెప్పను’ అని వీడియో రిలీజ్‌ చెయ్యాల్సి వచ్చింది. ఇప్పుడు వేణుస్వామి పరిస్థితి చూస్తుంటే జనంలో ఎంత వ్యతిరేకత ఉన్నా, అతన్ని ఎంత ట్రోల్‌ చేసినా పాపులారిటీ తగ్గినట్టు ఏమీ కనిపించడం లేదు. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం వేణుస్వామి చేయించే పూజల్ని ఎంతో సిల్లీగా తీసిపారేస్తుంటారు. అది హీరోయిన్ల అజ్ఞానం అంటూ కొట్టిపారేస్తుంటారు. మరికొందరు ఆయన్ని డైరెక్ట్‌గానే విమర్శిస్తుంటారు. అవేవీ పట్టించుకోని వేణుస్వామి తన పని తాను చేసుకుపోతున్నారు. 

తాజాగా వేణుస్వామితో కన్నడ హీరోయిన్‌ నిశ్విక నాయుడు పూజ చేయించుకుంది. ఇటీవల ‘కరటక దమనక’ చిత్రంలో ప్రభుదేవాతో కలిసి నటించింది నిశ్విక. వీరిద్దరూ కలిసి చేసిన పాట చాలా పాపులర్‌ అయిపోయింది. ప్రభుదేవాకి పోటీగా ఆమె వేసిన స్టెప్స్‌కి అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పుడు నిశ్విక కోసం వేణు స్వామి చేసిన పూజకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు పాజిటివ్‌గా కామెంట్స్‌ పెడుతుంటే.. మరికొందరు నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు వేణు స్వామి పూజకు బలైపోయారని, ఇప్పుడు మరో హీరోయిన్‌ బలైందంటూ కామెంట్‌ చేస్తున్నారు.



Source link

Related posts

ఆకట్టుకుంటున్న తంగలాన్ స్పెషల్ పోస్టర్.. గంగమ్మగా పార్వతి!

Oknews

ఆమె చిన్న కుర్రాడితో ప్రేమాయణం నడపడానికి భర్తనే డబ్బులు ఇస్తున్నాడా!

Oknews

ఓటిటి లోకి భీమా..డేట్ ఫిక్స్ 

Oknews

Leave a Comment