Health Care

వేసవిలో జింజర్, లెమన్ వాటర్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..


దిశ, ఫీచర్స్ : వేసవిలో మన శరీరానికి ఎక్కువ హైడ్రేషన్ అవసరం. అందుకే ఈ కాలంలో ఎక్కువ శాతంలో నీళ్ల తాగాలని నిపుణులు చెబుతారు. కానీ కొంతమంది సాధారణ నీటిని తాగడానికి ఇష్టపడరు. అలాంటి వారు వో డిటాక్స్ డ్రింక్ ని తాగుతారు. ఇందులో నిమ్మకాయ, అల్లం, పుదీనా, అనేక రకాల పండ్లు, కూరగాయలు వంటి అనేక వస్తువులను కట్ చేసి వేస్తారు. ఇది శరీరంలోని విషపదార్థాలు తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఇలా చేయడం ద్వారా మనిషి ఆరోగ్యంగా ఉంటారు.

నిజానికి శరీరం నుంచి విషపదార్ధాలు అంటే పేరుకుపోయిన మురికి బయటకు వచ్చిన వెంటనే, శరీరం లోపల నుండి శుభ్రంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి, చర్మం పై మెరుపును తీసుకురావడానికి, మునుపటి కంటే ఎక్కువ శక్తిని పొందడంలో సహాయపడుతుంది. మీరు తినే ఆహారం కూడా త్వరగా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది.

కొంతమంది ఉదయం నిద్ర లేవగానే లెమన్ వాటర్ తాగుతుంటారు. కానీ వేసవిలో నిమ్మకాయ, అల్లం నీటిని తీసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఇది మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పానీయాలు మీ శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో, హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి. దీని వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

రోగనిరోధక వ్యవస్థ..

రోగాల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి రోగనిరోధక వ్యవస్థ సహాయపడుతుంది. అందుకే అల్లం, నిమ్మకాయ నీరు తాగితే రోగనిరోధక వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండింటిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

మెరుగైన జీర్ణక్రియ..

నిమ్మ, అల్లం నీరు తాగడం జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండూ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. కానీ పరిమిత పరిమాణంలో తీసుకుంటే మంచిదంటున్నారు నిపుణులు.

బరువు నియంత్రణ..

చాలా మంది స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి ఉదయం నిద్ర లేవగానే లెమన్ వాటర్ తాగుతుంటారు. అల్లం జీవక్రియను పెంచి అదనపు కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. అయితే దీనితో పాటు మీరు వ్యాయామం, సరైన ఆహార ప్రణాళికను కూడా అనుసరించాలి.



Source link

Related posts

కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు వీటిని అసలు తినకూడదు!

Oknews

ఆహారం తిన్న తర్వాత ఈ పనులు చేస్తున్నారా… అయితే ప్రమాదంలో పడ్డట్టే!

Oknews

ఆయిల్ స్కిన్‌తో బాధపడుతున్నారా.. ఈ టిప్స్ ట్రై చేయండి

Oknews

Leave a Comment