రైళ్ల సంఖ్య పెంచాలని డిమాండ్అత్యవసర పరిస్థితుల్లో దూర ప్రయాణాలు చేయాల్సిన వారు రైలు రిజర్వేషన్లు ఫుల్(Train Reservations) కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా స్కూళ్లకు, కాలేజీలకు ఒకటి రెండు రోజులు సెలవులు ఇస్తేనే రైళ్లు, బస్సులు కిటకిటలాడతాయి. ఇక వేసవి సెలవులు అంటే రద్దీ విపరీతంగా ఉంటుంది. చదువులు కోసం నగరాలకు వచ్చిన వాళ్లు తిరిగి గ్రామాలకు వెళ్తుంటారు. అయితే రద్దీ తగిన విధంగా రైళ్లు అందుబాటులో ఉండడం లేదని ప్రయాణికుల వాదన. స్పెషల్ ట్రైన్లు నడిపినా… అవి అంతంత మాత్రమేనని అంటున్నారు. దీంతో ఈ వేసవికి తెలుగు రాష్ట్రాల(Telugu States) మధ్య మరిన్ని రైళ్లు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Source link