EntertainmentLatest News

వైభవంగా అప్సర రాణి ‘తలకోన’ ప్రీ రిలీజ్ వేడుక 


అక్షర క్రియేషన్ పతాకంపై నగేష్ నారదాసి దర్శకత్వంలో దేవర శ్రీధర్ రెడ్డి నిర్మాతగా అప్సర రాణి ప్రధాన పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ “తలకోన” . ఈ చిత్రం అన్ని  హంగులు పూర్తి చేసుకుని మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఫిల్మ్ ఛాంబర్ లో ప్రి రిలీజ్ వేడుక నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా ప్రముఖ నిర్మాతలు రామసత్యనారాయణ, సాయి వెంకట్, డీఎస్ రావు, ప్రముఖ హీరో రమాకాంత్  ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ పార్ధు రెడ్డి తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియచేశారు.

ఈ  సందర్భంగా చిత్ర  నిర్మాత శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. “మా హీరోయిన్ అప్సర రాణీ ఇప్పటివరకు చేయని వెరైటీ సబెక్ట్ ఇది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. అయితే ఫారెస్ట్ అనగానే కేవలం ప్రకృతి అందాలే కాదు అందులో ఇంకో కోణం కూడా వుంటుందని చూపించాం. అదే విధంగా పాలిటిక్స్, మీడియాను సైతం మిక్స్ చేసి చూపించడం జరుగుతుంది. అందుకు తగ్గ టీమ్ ను, టెక్నికల్ టీమ్ కూడా సినిమాకు తీసుకోవడం జరిగింది. అలాగే థ్రిల్లింగ్ సస్పెన్స్ తో మార్చి  29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు . 

దర్శకుడు నగేష్ నారదాసి  మాట్లాడుతూ.. “అప్సర రాణిని చూస్తే కాశ్మీర్ యాపిల్ ల కనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో తను  కాశ్మీర్ మిర్చి లా నటించింది. చాలా వెరైటీ స్టోరీ ఇది. షూటింగ్ తలకోనలో అద్భుతంగా జరిగింది. మా సినిమా తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. మా  లాంటి చిన్న సినిమాలకు సరైన షోస్ ఇచ్చి సినిమాలను బ్రతికించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను” అని అన్నారు.

హీరోయిన్ అప్సర రాణి మాట్లాడుతూ.. “నా కెరీర్ లో ఈ చిత్రం డెఫినెట్ గా ఓ మైలు రాయి గా నిలుస్తుంది. నేనింతవరకు చేయని ఫైట్స్ ఈ చిత్రంలో చేయడం జరిగింది. మాస్ & క్లాస్ ఆడియన్స్ కు కావలసిన అన్ని అంశాలు ఈ చిత్రంలో వున్నాయి. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.

అప్సర రాణి, అశోక్ కుమార్, అజయ్ ఘోష్, విజయ కరణ్,  రంగ రాజన్, రాజా రాయ్  యోగి కత్రి తదితరులు నటించిన ఈ  చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందించగా సినిమాటోగ్రాఫర్ గా ప్రసాద్, ఎడిటర్ గా ఆవుల వెంకటేష్ వ్యవహరించారు.



Source link

Related posts

ఓటీటీలోకి యోగి బాబు చట్నీ సాంబార్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Oknews

‘గ్రూప్-1’ వయోపరిమితిపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు, ఏమందంటే?

Oknews

Singareni Collieries Company has released notification for the recruitment of 327 various Posts check details here

Oknews

Leave a Comment