మూడో జాబితా
జనవరి 11న ప్రకటించిన మూడో జాబితాలో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్, విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మీ, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, విజయవాడ ఎంపీగా కేశినేని నాని, కర్నూలు ఎంపీగా గుమ్మనూరి జయరాం, తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలం పేర్లను ప్రకటించారు. రిజర్వుడు స్థానాల్లో పూతలపట్టులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్‌బాబును తప్పించి మూతిరేవుల సునీల్‌కుమార్‌ను నియమించారు. చింతలపూడిలో కంభం విజయరాజు, కోడుమూరులో డాక్టర్ సతీష్, గూడూరులో మేరిగ మురళి, సత్యవేడులో మద్దిల గురుమూర్తిలను ఖరారు చేశారు. ఇచ్చాపురం సమన్వయకర్తగా పిరియ విజయ, టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్, రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డి, దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, చిత్తూరులో విజయానందరెడ్డి, మదనపల్లెలో నిస్సార్ అహ్మద్, రాజంపేటలో ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి, ఆలూరులో బూసినే విరూపాక్షి, పెనమలూరులో జోగి రమేష్, పెడనలో ఉప్పాల రాములను సమన్వయకర్తలుగా నియమించారు.