Telangana

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్, చివరికి?-hyderabad news in telugu hoax bomb call to shamshabad rgi airport ,తెలంగాణ న్యూస్



అసలేం జరిగింది?గుర్తు తెలియని వ్యక్తి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఆదివారం బాంబులు పేల్చడానికి ఇద్దరు వ్యక్తులు కుట్ర చేస్తున్నట్లు సమాచారం ఇచ్చాడు. దీంతో విమానాశ్రయ భద్రతా సిబ్బంది గందరగోళానికి గురయ్యారు. ఎయిర్‌పోర్ట్ కాల్ సెంటర్‌కు శనివారం రాత్రి ఓ నంబర్‌కు ఫోన్ వచ్చింది. ఇద్దరు వ్యక్తులు బాంబులు పేల్చడానికి ఎయిర్ పోర్టుకు వస్తున్నారని, రెండు బ్యాగ్‌లతో ఉన్నారని, ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేయాలని చెప్పాడు. ఈ విషయంపై ఎయిర్ పోర్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాల్ చేసిన వ్యక్తి హైదరాబాద్ కాచిగూడకు చెందిన ప్రశాంత్‌గా పోలీసులు గుర్తించారు. ఓ టీ స్టాల్ లో ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు, పక్కనున్న వ్యక్తి వారి మాటలు విని ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు విమానాశ్రయ ఎంట్రన్స్ వద్ద ముమ్మర తనిఖీలు చేశారు. సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసుల తనిఖీల తర్వాత ఈ కాల్ ఫేక్ అని ప్రకటించారు. గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Source link

Related posts

TSRTC Farewell To Its Chairman Bajireddy Govardhan

Oknews

Adilabad | PenGanga Festival | 130 ఏళ్లుగా జరుగుతున్న పెన్ గంగా జాతర చరిత్ర తెలుసా | ABP Desam

Oknews

Lic Children Plan Amritbaal Scheme Will Give Assured Return And Insurance For Kids

Oknews

Leave a Comment