GossipsLatest News

శరణు.. అంటున్న వైఎస్ జగన్!


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కలలో కూడా ఊహించని ఫలితాలు రావడంతో వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఓ వైపు గత పాలనలో జరిగిన అవినీతి, మరోవైపు.. తాడేపల్లి, వయా రుషికొండ, బెంగళూరు ప్యాలెస్‌ వరకూ బాగోతాలు బయటపడటం, ఆఖరికి ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీసును రాజ్ మహల్ రీతిలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఆఖరికి అక్రమ నిర్మాణమైన వైసీపీ కేంద్ర కార్యాలయంపై బుల్డోజర్ దెబ్బ కూడా పడింది. బహుశా రేపో మాపో గత పాలనపై 7 శాఖల్లో అవినీతిపై శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది కూటమి సర్కార్. ఇక అప్పుడే అసలు సిసలైన సినిమా ఏపీ రాజకీయాల్లో మొదలు కానుంది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థల దెబ్బకు త్వరలోనే వైఎస్ జగన్ అబ్బా అనే పరిస్థితి దగ్గర పడినట్లే ఉంది..!

వస్తా.. నీ వెనుక..!

బహుశా మిగిలింది.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ మాత్రమే అనుకుంటా..!. అధికారం కోల్పోవడంతో దిక్కు తోచని స్థితిలో వైసీపీకి ఇప్పుడు కేంద్రం అండ ఎంతైనా అవసరం ఉంది. అందుకే.. కేంద్రంలోని మోదీ సర్కార్‌కు, అది కూడా ఏపీలో టీడీపీతో కూటమి గట్టిన విషయం గుర్తుండి మరీ ఎన్డీఏకు మద్దతివ్వడం అంటే మామూలు విషయం కాదు. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక విషయంలో ఎన్డీఏ నానా తిప్పలు పడుతోంది. ఇక ఇండియా కూటమి సైతం కె. సురేష్‌ను రంగంలోకి దింపేసింది. దీంతో మోదీ 3.0కు ఆదిలోనే చిక్కులు మొదలైనట్లు అయ్యింది. ఎన్డీఏ కూటమిలోని పార్టీలు కాకుండా బయటి నుంచి ఎవరు మద్దతిస్తారా..? అని మంతనాలు జరిపే పనిలో ఉంది. దీన్నే అదునుగా చేసుకున్న వైసీపీ.. మద్దతిస్తున్నట్లు ప్రకటించేసింది. సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి ద్వారా ఈ విషయాన్ని హైకమాండ్‌కు చేరవేసింది. అదేదో సినిమాలో పాటలాగా.. వస్తా నీ వెనుక, దగ్గరగా రా.. దగ్గరగా రా.. అన్నట్లుగా వైసీపీ పరిస్థితి తయారయ్యింది..! అంటే.. ఏపీలో శత్రువులుగా ఉన్నా హస్తినలో మాత్రం టీడీపీ, వైసీపీ ఒక్కరికే మద్దతు ఇస్తుండటం గమనార్హం.

భయం.. భయం!

వాస్తవానికి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్‌పై బయటికొచ్చి పదేళ్లుపైనే అయ్యింది. దీంతో అరెస్ట్ కత్తి ఆయన్ను వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వం ఉన్నప్పుడు సాధారణ కార్యకర్త మొదలుకుని అధినేత వరకూ టీడీపీని జగన్ ఎన్ని, ఎలా ఇబ్బందులు పెట్టారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆఖరికి ప్రస్తుత సీఎం నారా చంద్రబాబును అక్రమ కేసులో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో 53 రోజులు పెట్టిన పరిస్థితి. ఇప్పుడిప్పుడే జగన్ చిట్టాలు తీయడం మొదలుపెట్టిన టీడీపీ కూటమి సర్కార్.. ఆయన్ను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. ఇక ఎలా అక్రమాస్తుల కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో జగన్‌లో భయం మొదలైందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అందుకే కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌తో కాస్త అండ ఉంటే బాగుంటుందని భావించి.. ఇలా అంశాల వారీగా, ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇవ్వడం షురూ చేసింది వైసీపీ. ఉన్న లోక్‌సభ నలుగురు, రాజ్యసభలో ఉన్న ఎంపీలతో ఏదో విధంగా కేసులు, అరెస్ట్ నుంచి గట్టెక్కాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. అయినా చంద్రబాబు నుంచి ఎలా తప్పించుకుంటారో.. ఏం చేస్తారో చూడాలి మరి.



Source link

Related posts

Raja Saab: Is Maruti tension over? రాజా సాబ్: మారుతి టెన్షన్ తీరినట్లేనా?

Oknews

భారతీయుడు 2 యుఎస్ రివ్యూ 

Oknews

విజయ్ ఫొటోలు లీక్.. రంగంలోకి సితార!

Oknews

Leave a Comment