Top Stories

శృతిహాసన్ చేతికి సమంత సినిమా


ఓ అంతర్జాతీయ చిత్రంలో సమంత నటించబోతోందనే విషయం పాతదే. బఫ్టా అవార్డ్ విన్నింగ్ డైరక్టర్ ఫిలిప్ జాన్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ఇప్పుడీ ఇంటర్నేషన్ ప్రాజెక్ట్ నుంచి సమంత తప్పుకుంది. ఆ స్థానాన్ని శృతిహాసన్ ఆక్రమించింది.

ది ఎరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా రాబోతోంది. ఇందులో చెన్నై కేంద్రంగా పనిచేసే ప్రైవేట్ డిటెక్టివ్ గా శృతిహాసన్ నటించనుంది.

ఈ పాత్ర సమంతకు చాలా నచ్చింది. ఆ పుస్తకాన్ని ఇప్పటికే చదివిన సమంత, ఇందులో నటించడానికి అంగీకరించింది. అయితే ఆ తర్వాత ఆమె మయొసైటిస్ బారిన పడడం, పూర్తిగా కోలుకోవడం కోసం గ్యాప్ తీసుకోవడం తెలిసిందే.

ఈ క్రమంలో ఈ సినిమా నుంచి సమంత తప్పుకోవడం, శృతిహాసన్ జాయిన్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాలో బ్రిటన్ కు చెందిన కెవిన్ హార్ట్, జాన్ రెనో, శామ్ వర్తింగ్టన్ లాంటి ఆర్టిస్టులు నటించనున్నారు. కథ ప్రకారం, చెన్నై, కార్డఫ్ నగరాల్లో ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేశారు.



Source link

Related posts

బాబు ప్రాణానికి ముప్పు.. వైసీపీ హత్య చేసుకున్నట్లే..!

Oknews

ర‌ఘురామ త‌ప్ప‌.. సీఐడీపై ఫిర్యాదులేవీ?

Oknews

వైసీపీ పెత్తందారులను దూరం పెడ‌తారా?

Oknews

Leave a Comment