ముఖ్యమంతిగా పవర్ లో ఉన్న జగన్ మోహాన్ రెడ్డి తప్పు చేసినా అదేదో పెద్ద త్యాగం, మంచి పనిగా ఊదరగొట్టే వైసీపీ అనుకూల బ్లూ మీడియా ఇప్పుడు జగన్ అధికారం కోల్పోవడంతో అనూహ్యంగా జగన్ ఓటమికి కారణాలని ఎత్తి చూపడమే కాదు.. జగన్ కి వ్యతిరేఖ కథనాలతో షాకిస్తుంది. జగన్ ఒంటెద్దు పోకడల కారణంగానే వైసీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది అంటూ బహిరంగంగానే జగన్ ని విమర్శిస్తోంది.
మరోపక్క టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ని పొగడకుండా ఉండలేకపోతుంది. ఇంకోపక్క వరసగా జగన్ తప్పులని ఎత్తి చూపుతుంది. ఐదేళ్లుగా కనబడని జగన్ తప్పులు ఇప్పుడు ఓటమి చవి చూశాక ఆ ఐదేళ్ల తప్పులు ఇప్పుడు బ్లూ మీడియా తవ్వి తవ్వి చూపిస్తుంది. జగన్ స్వార్ధం కారణంగానే వైసీపీ 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైసీపీ లో నేను అనే స్వార్థంతోనే జగన్ మోహన్ రెడ్డి కార్యకర్తలని, ఎమ్యెల్యేలని మంత్రులని పట్టించుకోలేదు. వాలంటీర్లని నమ్మి వాళ్ళ వల్లే పార్టీ గెలుస్తుంది. ప్రజలకి తనకి మద్యన ఎవ్వరు ఉండకూడదనే స్వార్ధం జగన్ ని ఓటమి పాలు చేసింది.
జగన్ వాలంటీర్లని నమ్మారు, మనతో పనేముంది, మనమే జగన్ ని సీఎం ని చేసాము, కానీ జగన్ మాత్రం మనల్ని నమ్మడమే లేదు అంటూ వైసీపీ కేడర్ కోపంతోనే కూటమికి జై కొట్టింది. వాలంటీర్ల వల్లే వైసీపీ కార్యకర్తలు పార్టీకి దూరమయ్యారు. అందరూ బాగుండాలి అందులో తానుండాలి అని జగన్ అనుకోలేదు. అందరిలో తనొక్కడే బావుండాలని అనుకున్నాడు.
అదే వైసీపీ పార్టీ కొంప ముంచింది. జగన్ స్వార్ధమే వైసీపీ కి ప్రాణ సంకటంగా మారింది. 151 ఎక్కడ, 11 ఎక్కడ, ఇదంతా కేవలం జగన్ స్వయంకృపరాధమే అంటూ బ్లూ మీడియా జగన్ ని, వైసీపీ పార్టీని విమర్శిస్తూ రాస్తున్న రాతలకి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.