ఆయన మాములు నిర్మాత కాదు. సందీప్ కిషన్(sundeep kishan) లాంటి హీరోతోనే సినిమా నిర్మించాడు. అంతే కాదు మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థి గా కూడా పోటీ చేసాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.ఇంతకీ ఆయన ఎవరో, ఏం చేసాడో చూద్దాం.
షేక్ బషీద్(sk bhashed) సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ప్రాజెక్ట్ జెడ్ కి నిర్మాత. ఇదే కాదు ఇంకా చాలా చిత్రాలని నిర్మించాడు.అవన్నీ కూడా అంతగా ప్రజాదరణ పొందలేదు.చాలా సార్లు వివాదాస్పద నిర్మాతగాను పేరు తెచ్చుకున్నాడు. సందీప్ కిషన్ మీద గతంలో చాలా ఆరోపణలు కూడా చేసాడు.ఇక అసలు విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్ లో ఉన్న ఇండస్ బ్యాంకు నుంచి నలభై కోట్ల రూపాయిల భారీ మొత్తాన్ని తన ఖాతాకి మళ్లించుకున్నాడు. ఇందుకు బ్యాంకు మేనేజర్ తో పాటు ఇంకో అధికారి కూడా బషీద్ కి సహకరించారు. అందుకు గాను బ్యాంకు మేనేజర్ కి బషీద్ ఒక కారు కూడా బహుమతిగా ఇచ్చిన్నట్టు తేల్చారు.
దీంతో పోలీసులు ఢిల్లీలో ఉన్న బషీద్ తో పాటు బ్యాంకు అధికారులని కూడా అరెస్ట్ చేసారు. ఇక బషీద్ కొన్ని సినిమాల్లో నటించాడు కూడా. గతంలో కూడా బషీద్ మీద రకరకాల ఆరోపణలు వచ్చాయి. మొన్న జరిగిన ఏపి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజంపేట ఎమ్ పి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.