Entertainment

సలార్ 2 గురించి ఫ్యాన్స్ కంగారుపడద్దు..బాబీ సింహ చెప్పాడు  


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో గత డిసెంబర్ లో వచ్చిన మూవీ సలార్. ఇండియన్ ఫిలిం హిస్టరీలో హయ్యస్ట్ గ్రాసర్ సాధించిన టాప్ 10 మూవీస్ లో ఒకటిగా కూడా సలార్ నిలిచింది.దీంతో సలార్ 2  మీద  భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ అయితే సలార్ 2 ఎప్పుడెప్పుడు షూట్ కి వెళ్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఎదురు చూడటమే కాదు సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వార్తలు కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ టైంలో ఒక నటుడు చెప్పిన విషయం ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తుతుంది.

సలార్ లో భారవ పాత్రలో నటించి ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన నటుడు బాబీ సింహ. ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు . అందులో సలార్ 2  షూట్  ఏప్రిల్ నుంచి మొదలు కాబోతుందని చెప్పాడు. అయన చెప్పిన ఈ మాటతో  ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే  పార్ట్ 1 చూస్తున్నపుడే పార్ట్ 2 లో ప్రభాస్ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడనే విషయం ఫ్యాన్స్ తో పాటు అందరికి అర్ధమయ్యింది. పైగా పార్ట్ 2 లోనే   కథ కి కంక్లూజ్ కూడా ఉంది.దీంతో  బాబీ సింహ చెప్పిన మాటలు  ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

  ఇక ప్రభాస్ ప్రస్తుతం కల్కి, రాజా సాబ్ చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కల్కి అయితే  షూటింగ్ చివరి దశలోఉంది. మే 9 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారకంగా కూడా ప్రకటించారు. అలాగే సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ అనే మూవీకి కూడా కమిటీ అయ్యాడు. దీంతో  ప్రభాస్ ఫ్యాన్స్ కి  2024 ,25 లు చాలా స్పెషల్ ఇయర్స్ గా నిలుస్తాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 



Source link

Related posts

షాక్ ఇస్తున్న ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ డే కలెక్షన్స్..అంతా అనుకున్నట్టే అవుతుందా

Oknews

మెగా హీరో వరుణ్ తేజ్ కి అడ్డంగా బాలీవుడ్ సినిమా

Oknews

‘రాజధాని ఫైల్స్’ పబ్లిక్ టాక్.. ప్రతి రైతుబిడ్డ చూడాల్సిన సినిమా

Oknews

Leave a Comment