GossipsLatest News

సాంప్రదాయని.. సుప్పినీ.. సుద్దపూసనీ!


అధికారం ఉంటే ఆ కిక్కు, మజా వేరుగా ఉంటుంది కదా..! నేను చెప్పిందే వేదం.. చేసిందే శాసనం.. మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే సవాలక్ష ఉంటాయ్. ఒక్కసారిగా అధికారం కోల్పోతే సినిమా కనిపిస్తుంది కదూ..! ఇప్పుడు అచ్చుగుద్దినట్లుగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు గులాబీ బాస్ ఏం చేశారో.. రాష్ట్రాన్ని ఏ మాత్రం ఉద్దరించారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రాష్ట్రాన్ని సాధించింది మొదలుకుని.. ఇప్పుడు జనాలు బతుకుతున్న బతుకు వరకూ అంతా మా భిక్షే అన్నట్లుగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అబ్బో.. సార్ ఇక మీడియా ముందుకు వస్తే ఆ పంచ్‌లు, ప్రాస, డైలాగ్స్ ఇవన్నీ మాటల్లో చెప్పలేం. అసలు ప్రతిపక్షం గురించి మాట్లాడాల్సి వస్తే కరివేపాకు కంటే దారుణంగా తీసిపడేసేవారు. రాష్ట్రంలో ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అన్నట్లుగా ప్రవర్తించేవారు. నాటి ప్రతిపక్షాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు నోరు తెరిస్తే చాలు నోరు మూయించడానికి ఏం చేయడానికైనా వెనుకాడేవారు కాదని నేతలు చెప్పుకుండేవారు. సీన్ కట్ చేస్తే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు అవన్నీ కేసీఆర్‌కే రివర్స్ అవుతున్న పరిస్థితి. సింపుల్‌గా అధికారంలో ఉన్నపుడు సార్.. అధికారం కోల్పోయిన తర్వాత సారు పరిస్థితి ఎలా ఉందనేది ఉదాహరణతో సహా చూసేద్దాం రండి.

అధికారంలో ఉన్నప్పుడు..!

సారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు గురించి మాట్లాడాల్సి వస్తే చాలు.. దారుణాతి దారుణంగా నోటికి ఎంతొస్తే అంత మాట అనేసేవారు. బ్రోకర్లు, నీ బొంద.. సిగ్గులేని దరిద్రులు, ముండ ముఖాలు, ముండ జీవితం.. పిచ్చి కుక్కలు, నక్కలు, హవలా పూసలు, లంగాలు, అసలు సిగ్గూ శరం ఉందా..?, సిగ్గులేని దరిద్రులు, దేశానికి పట్టిన కుక్క మూతి పిందె మీరు, పాగల్ గాళ్లు, ఏం పీకుతారు, ఏం పీకనీకి వచ్చిర్రు, ఏం పీకి పడగొడతారా..? ఇలా ఒకటా రెండా మీడియా ముఖంగా.. బహిరంగ సభల్లో.. చట్ట సభల్లో ఎన్నెన్ని మాటలు అన్నారో తెలంగాణ ప్రజానికానికి బాగా తెలుసు. ఒక్క కాంగ్రెస్‌ను ఉద్దేశించే కాదు.. బీజేపీపై కూడా విమర్శలు గుప్పించిన సందర్భాలు కోకొల్లలు. ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా నాటి నుంచి నేటి వరకూ ఎలా ప్రవర్తిస్తోందో.. ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక అరెస్టులు, గొంతు నొక్కుడు చర్యలకైతే అస్సలు వెనుకాడేదిలే అన్నట్లుగా కేసీఆర్ వ్యవహారం ఉండేది.

అధికారం పోయినప్పుడు..!

అధికారం పోయిన తర్వాత విమర్శలు, ట్రోలింగ్స్, కౌంటర్లు ఇస్తుంటే సారు అస్సలు తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడున్న అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి కౌంటర్లు వస్తుంటే గులాబీ బాస్‌కు ఒళ్లు మండిపోతోంది. ఏంటి నన్నే విమర్శిస్తారా.. ఎంత ధైర్యం.. నేను తెలంగాణ బాపును.. రాష్ట్రాన్ని సాధించిన అభినవ గాంధీని అన్నట్లుగా కేసీఆర్ ఫీలయిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు కరీంనగర్ కదనభేరీ నుంచి.. ప్రచారం షురూ చేసిన గులాబీ బాస్ గత కొన్నిరోజులుగా తనపై వస్తున్న ట్రోలింగ్స్, కాంగ్రెస్ నేతల కౌంటర్ల గురించి స్పందించారు. ఇంత అసహనమా..? ఒక ముఖ్యమంత్రి వాడాల్సిన భాషేనా..? ఇది పద్ధతేనా..? ఇది తెలంగాణ సమాజానికి మనమిచ్చే గౌరవం ఇదేనా..?. నేను పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా నోటినుంచి ఒక్కసారైనా దురుసు మాట విన్నారా..?. దయచేసి ఆలోచన చేయాలని మనవి చేస్తున్నాను అని కేసీఆర్ సభాముఖంగా చెప్పుకొచ్చారు. కాగా రేవంత్ సీఎం అయ్యాక.. కేసీఆర్‌ను గట్టిగానే అరుసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. పండపెట్టి తొక్కుతా.. పేగులు మెడలో వేసుకుంటా.. అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్‌ను ఎలాంటి ఇబ్బందులకు గురిచేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదేమో. చూశారుగా అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రవర్తన.. అధికారం పోయిన తర్వాత బాసు నోటి నుంచి వస్తున్న మాటలను.. ఈ మధ్య 90S సిరీస్‌లోని డైలాగ్, సాంగ్‌ అయిన సాంప్రదాయని.. సుప్పినీ.. సుద్దపూసనీ గుర్తొస్తోంది. అప్పుడే ఏముంది.. మున్ముందు ఇంకా చాలా సినిమానే ఉంది మరి.



Source link

Related posts

‘దేవర’ వర్సెస్ ‘గేమ్ ఛేంజర్’.. బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్..!

Oknews

4 parties.. 2 families.. AP politics 4 పార్టీలు.. 2 ఫ్యామిలీలు.. ఏపీ అంటార్రా బాబూ

Oknews

Buddha mass warning for Kodali Nani కొడాలి నానికి బుద్ధా మాస్ వార్నింగ్

Oknews

Leave a Comment