Andhra Pradesh

సిఎమ్ యేనా..ఎమ్మెల్యేలు వద్దా?


నేను సిఎమ్ ను…నేనే సిఎమ్ ను…నేను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవరు అడ్డం పడతారో చూస్తా.…- ఇదీ పవన్ స్టయిల్.

ఈ అభ్యర్థిని ఇక్కడ డిసైడ్ చేస్తున్నా..మీరు గెలిపించి పంపించండి. మంత్రిని కూడా చేస్తా- ఇదీ లోకేష్ కావచ్చు, జగన్ కావచ్చు..స్టయిల్ వారిది ఇలా.

పవన్ బాధ ఎప్పుడూ ఒక్కటే… నాకు మీరు ఓటేయలేదు. వేసి వుంటే ఊడపొడిచేవాడిని. ఇప్పుడైనా వేయండి. సిఎమ్ ను చేయండి. కానీ మనది అమెరికా మాదిరిగా నేరుగా ఎన్నుకునే వ్యవస్థ కాదు కదా? మరి పవన్ ను సిఎమ్ ను చేయాలంటే జనం ఏం చేయాలి? జనసేన ఎమ్మెల్యేలను ఎన్నుకోవాలి. వాళ్లంతా కలిసి పవన్ ను సిఎమ్ ను చేయాలి. అంటే ముందుగా పవన్ అడగాల్సింది ఏమిటి?

జనసేన అభ్యర్ధులను గెలిపించండి. జనసేన పార్టీని గెలిపించండి. అప్పుడు నేను సిఎమ్ అవుతా అని కదా చెప్పాల్సింది? ముందస్తు ఎన్నికలు తధ్యం అని పవన్ కు ఏ ఆకాశవాణి నో చెప్పింది. ఆయన అదే నమ్మకంతో వున్నారు. అంటే మరో ఆరు నెలల్లో ఎన్నికలు తథ్యం.

మరి అలాంటపుడు పవన్ చేయాల్సింది ఏమిటి? అభ్యర్థులను డిసైడ్ చేయడం. అసలే కొత్త పార్టీ, కొత్త అభ్యర్థులు, పెద్ద పార్టీలు రెండు ఎదురుగా వుంటాయి. వాటిని కాదని, ఢీకొని పోటీ చేయాలంటే అన్ని విధాలా సన్నాహాలు చేసుకోవాల్సి వుంటుంది. అర్థిక వనరులు సమకూర్చుకోవాల్సి వుంటుంది. అనుచరవర్గాన్ని సమీకరించుకోవాల్సి వుంటుంది. అలా చేయాలంటే పవన్ సభాముఖంగా ఇక్కడ ఈ అభ్యర్థిని నిలబెడుతున్నా, మీరు గెలిపించాలి. అప్పుడు నేను సిఎమ్ అయ్యే చాన్స్ వుంటుంది. అంటూ అభ్యర్థి మంచి చెడ్డలు కూడా వివరించాలి.

అవన్నీ మానేసి. నేను ఎమ్మెల్యే అవుతా..నేను సిఎమ్ అవుతా..నన్ను ఎవరు ఆపుతారు..అంటూ చెప్పుకుంటూ పోతే ఆ ఒక్క పూటా బాగుంటుంది. తరువాత చెప్పుకోవానికి ఏమీ వుండదు.



Source link

Related posts

జగన్‌పై దాడి కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఈసీ ఆదేశం-ec orders to speed up investigation of jagan attack case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌-ap high court reserved verdict in chandrababu bail petition in fibernet case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

దేశంలో టాప్ సీఫుడ్ ఎగుమతి గేట్ వేగా వైజాగ్ పోర్టు

Oknews

Leave a Comment