Entertainment

సినిమా ఇప్పించిన చిరంజీవి.. థాంక్స్‌ చెప్పిన రాజశేఖర్‌!


ఒక హీరో తిరస్కరించిన కథ మరో హీరో దగ్గరికి వెళ్లడం, ఆ సినిమా సూపర్‌హిట్‌ అయిన సందర్భాలు చాలా ఉంటాయి. అదే విషయంలో ఫ్లాప్‌ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. మరికొంతమంది హీరోలు తమ దగ్గరికి వచ్చిన కథ తనకు సూట్‌ అవ్వదని, ఫలానా హీరోకైతే బాగుంటుందని దర్శకనిర్మాతలకు సూచించిన సందర్భాలు అనేకం సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంటాయి. అలా మెగాస్టార్‌ చిరంజీవి తన సహ నటుడు రాజశేఖర్‌ను ఒక సినిమా కోసం రికమెండ్‌ చేశారు. 

మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ఒరు సీబీఐ డైరీ కురిప్పు’ అనే సినిమాను తెలుగులో రీమేక్‌ చెయ్యాలని రవిరాజా పినిశెట్టి అనుకున్నారు. ఇందులో హీరో సీబీఐ ఆఫీసర్‌. ఈ క్యారెక్టర్‌ రాజశేఖర్‌ చేస్తే బాగుంటుందని చిరంజీవి సూచించారట. వాస్తవానికి ఆ మలయాళ సినిమా చూసిన రాజశేఖర్‌  తన నిర్మాతలతో ఈ సినిమా రైట్స్‌ కొనిపించి ఆ సినిమాలో తనే నటించాలనుకున్నాడు. కానీ, అప్పటికే అల్లు అరవింద్‌ ఆ సినిమా రైట్స్‌ను కొనుగోలు చేశారని తెలిసి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు రాజశేఖర్‌. ఎందుకంటే అల్లు అరవింద్‌ అంటే ఆ సినిమాను చిరంజీవితోనే చేస్తారని భావించాడు రాజశేఖర్‌. 

కొంతకాలం తర్వాత ఒక సినిమా శతదినోత్సవంలో రాజశేఖర్‌, అల్లు అరవింద్‌ కలుసుకున్నారు. మాటల్లో ‘ఒరు సీబీఐ డైరీ కురిప్పు’ సినిమా ప్రస్తావన వచ్చింది. ఆ సినిమా రైట్స్‌ తాను తీసుకున్నానని చెప్పారు అరవింద్‌. నీతోనే చేస్తాను. ఆ సినిమాలో నటిస్తావా అని రాజశేఖర్‌ని అడిగారు. ఆ మాటతో ఆశ్చర్యపోయిన రాజశేఖర్‌ మరో మాట లేకుండా వెంటనే ఒప్పుకున్నారు. ‘మీరు రైట్స్‌ తీసుకున్నారని తెలిసి, అది చిరంజీవిగారితోనే చేస్తారని అనుకున్నాను. కానీ, అంత మంచి క్యారెక్టర్‌ నాకు ఇచ్చినందుకు థాంక్స్‌’ అన్నారు రాజశేఖర్‌. దానికి అరవింద్‌ ‘ఈ సినిమాను మొదట చిరంజీవితోనే చేద్దామనుకున్నాం. కానీ, అతని కాల్షీట్స్‌ లేవు. ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే.. చిరంజీవే స్వయంగా మీ పేరు సజెస్ట్‌ చేశారు’ అని చెప్పారు. మరో సందర్భంలో చిరంజీవిని కలిసిన రాజశేఖర్‌ తనకు సినిమా ఇప్పించినందుకు థాంక్స్‌ చెప్పారు. అదే రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 1988లో వచ్చిన ‘న్యాయం కోసం’ సినిమా. అభినందన సభలో తను ఈ సినిమా చేయడం వెనుక అసలు కారణాన్ని వివరించారు రాజశేఖర్‌. 



Source link

Related posts

సమంత రీ ఎంట్రీకి రెడీ అవుతోందా.. అందుకే అలా చేస్తోందా?

Oknews

Feedly AI understands threat actor groups – Feedly Blog

Oknews

ఓటీటీలోకి సడన్ గా తెలుగులో వచ్చేసిన 12th ఫెయిల్!

Oknews

Leave a Comment