Entertainment

సినిమా టికెట్ ని ఆవిష్కరించిన ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ 


సినిమా పుట్టినప్పటి నుంచి చిన్న సినిమా పెద్ద సినిమా అనే బేధం లేదు.అలాగే చిన్న హీరో పెద్ద హీరో అనే బేధం కూడా  లేదు  కథ, కథనాలు, ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్  బాగుంటే చాలు ఆ సినిమా ఘన విజయం సాధిస్తుంది. ఇటీవల  వచ్చిన హనుమాన్ మూవీనే అందుకు తాజా ఉదాహరణ. ఇప్పుడు ఇదే కోవలో సక్సెస్ కావటానికి ఒక మూవీ రాబోతుంది. తాజాగా ఆ మూవీకి సంబంధించి జరిగిన ఫంక్షన్ లో ఇండియన్ మాజీ  క్రికెట్ కెప్టెన్ పాల్గొనడం ప్రాధాన్యతని సంతరించుకుంది.

ప్రముఖ నటినటులు గీతానంద్ నేహా సోలంకి లు జంటగా సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఆన్( game on) తాజాగా ఆ మూవీకి సంబంధించిన  బిగ్ టికెట్ లాంచింగ్ కార్యక్రమం జరిగింది. మాజీ భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్( mithali raj)తో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు(dil raju) ప్రముఖ హీరోలైన శ్రీకాంత్, ఆది సాయి కుమార్, అశ్విన్, తరుణ్ ల  చేతుల మీదుగా గేమ్ ఆన్   టికెట్ లాంచ్  చేసి సినిమా సక్సెస్ కావాలంటూ విష్ చేశారు. క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్  గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై నిర్మాణం జరుపుకున్న ఈ గేమ్ ఆన్ లో  మధుబాల, ఆదిత్య మీనన్ శుభలేఖ సుధాకర్ లాంటి సీనియర్ యాక్టర్స్  కీలక పాత్రలు పోషించారు.

 ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ లతో ప్రేక్షకుల్లో గేమ్ ఆన్ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అలాగే సాంగ్స్ కి కూడా  మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫిబ్రవరి 2 న విడుదల అవుతున్న ఈ మూవీకి రవి కస్తూరి నిర్మాత కాగా దయానంద్ దర్శక బాధ్యతలని నిర్వహిస్తుండగా మ్యూజిక్ ని  అభిషేక్ ఏ ఆర్,  సాంగ్స్ ని  న‌వాబ్ గ్యాంగ్‌ అశ్విన్ అండ్ అరుణ్‌ లు అందించారు. ఇక అర‌వింద్ విశ్వ‌నాథ‌న్‌  సినిమాటోగ్రఫీ ని  స్క్రిప్ట్  సూప‌ర్ వైజ‌ర్ గా విజ‌య్ కుమార్ సి.హెచ్ లు  వ్యవహరించారు. ఇక ఎడిట‌ర్ గా  వంశీ అట్లూరి , ఆర్ట్ డైరెక్టర్ గా విఠ‌ల్‌   కొరియోగ్రాఫర్ గా  మోయిన్ ,ఫైట్స్   రామ‌కృష్ణ‌. న‌భా స్టంట్స్ లు అందించారు జి.కె మీడియా పిఆర్ఓ గా  వ్యవహరిస్తోంది.

 



Source link

Related posts

డబ్బు కోసం తప్పు పని చెయ్యాల్సిన అవసరం లేదు..సిఎం కొడుకైతే ఏంటి

Oknews

జాతీయ సినిమా దినోత్సవం.. మూవీ లవర్స్‌కి బంపర్‌ ఆఫర్‌!

Oknews

'శివం భజే' ఫస్ట్ కట్ అదిరింది!

Oknews

Leave a Comment