EntertainmentLatest News

సూపర్ స్టార్ తో ‘సప్త సాగరాలు దాటి’ డైరెక్టర్ సినిమా.. ఫుల్ యాక్షన్!


‘సప్త సాగరాలు దాటి’ ఫ్రాంచైజ్ తో ప్రేక్షకులను మెప్పించాడు దర్శకుడు హేమంత్ ఎం రావు. 2023లో రెండు భాగాలుగా వచ్చిన ఈ క‌న్న‌డ మూవీ తెలుగుతో పాటు సౌత్ ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి కథానాయికగా న‌టించింది. ఇక ఈ సినిమా అనంత‌రం త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు హేమంత్ రావు. 

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా హేమంత్ ఎం రావు త‌న నెక్స్ట్ మూవీ చేయ‌బోతున్నాడు. జె.ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ జె గౌడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న‌ట్లు స‌మాచారం. 

‘గోధి బన్న సాధారణ మైకట్టు’, ‘కవలుదారి’, ‘సప్త సాగరాలు దాటి’ లాంటి డిఫరెంట్ జాన‌ర్‌లు త‌ర్వాత హేమంత్ ఎం రావు యాక్ష‌న్ సినిమా చేయ‌నుండ‌డంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది.

వైశాక్ ఏ గౌడ “తాను నిర్మిస్తున్న మొదటి సినిమానే శివరాజ్ కుమార్ లాంటి స్టార్ట్ తో చేయడం సంతోషంగా ఉందని. ఈ ప్రాజెక్ట్ తనపై భాధ్యతను పెంచింది” అని తెలియజేశారు.



Source link

Related posts

ఓటీటీలోకి దర్శన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

Oknews

new governing bodies of two agricultural market committes in telangana

Oknews

Interesting update on Devara దేవర పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Oknews

Leave a Comment