EntertainmentLatest News

సూర్య వర్సెస్ సూర్య.. ‘కంగువ’ మూవీ స్టోరీ ఇదే…


కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కంగువ'(Kanguva). ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

‘కంగువ’ సినిమా మొదట నుంచి పీరియడ్ యాక్షన్ ఫిల్మ్ గా ప్రచారం పొందింది. అయితే ఇది పూర్తి పీరియడ్ ఫిల్మ్ కాదట. ‘కంగువ’ అనేది టైం ట్రావెల్ నేపథ్యంలో సాగే ఫాంటసీ ఫిల్మ్ అని తెలుస్తోంది. ఈ కథ 1670 ప్రాంతంలో, అలాగే వర్తమానంలో జరగనుందట. 1670లలో క్రూరమైన ట్రైబల్ వారియర్ గా సూర్య కనిపించనున్నాడట. అయితే టైం ట్రావెల్ చేసి సూర్య ప్రజెంట్ లోకి వస్తాడట. ఒక క్రూరమైన ట్రైబల్ వారియర్ ఎందుకు టైం ట్రావెల్ చేశాడు? ఎలా చేశాడు? వర్తమానంలో అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అనేది ఈ చిత్ర కథాంశమని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

నిజానికి మూడు నెలల క్రితం ‘కంగువ’ సెకండ్ లుక్ పోస్టర్ విడుదలైనప్పుడే.. ఇది వేరు వేరు కాలాలలో జరిగే కథ అని అర్థమైంది. ఎందుకంటే ఆ పోస్టర్ లో సూర్య యుద్ధవీరుడిగా కనిపించడంతో పాటు ట్రెండీ లుక్ లోనూ సర్ ప్రైజ్ చేశాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాని 2024 లోనే విడుదల చేయనున్నట్లు తెలుపుతూ తాజాగా మరో పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఆ పోస్టర్ ‘సూర్య వర్సెస్ సూర్య’ అన్నట్టుగా ఉంది. ఓ వైపు కత్తి పట్టుకొని వారియర్ గా, మరోవైపు గన్ పట్టుకొని గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నాడు సూర్య. ఈ సినిమా ట్రావెల్ ట్రావెల్ నేపథ్యంలో ఉండనుందనే వార్తలకు తాజా పోస్టర్ బలం చేకూరుస్తోంది. ట్రైబల్ వారియర్ అయిన సూర్య టైం ట్రావెల్ చేసి, వర్తమానంలో గ్యాంగ్ స్టార్ గా ఉన్న సూర్యతో తలపడనున్నాడని అర్థమవుతోంది.



Source link

Related posts

Ajith Kumar Health update అజిత్ కి జరిగింది బ్రెయిన్ సర్జరీ కాదు

Oknews

18 ఏళ్ళ తర్వాత.. డార్లింగ్ తో కలిసి…

Oknews

గోపీచంద్ మరో సాహసం.. 'రాధేశ్యామ్' దర్శకుడితో సినిమా!

Oknews

Leave a Comment