Top Stories

సెన్సార్ సర్టిఫికేట్ కోసం లంచం ఇచ్చిన హీరో


హీరో విశాల్ సంచలన ఆరోపణలతో సోషల్ మీడియాలోకి ఎక్కాడు. ముంబయి సెన్సార్ బోర్డుపై అవినీతి ఆరోపణలు చేశాడు ఈ నటుడు. కేవలం ఆరోపణలతో సరిపెట్టలేదు. దీనికి సంబంధించి ఆయన సాక్ష్యాల్ని కూడా సమర్పించాడు.

"వెండితెరపై అవినీతిని చూపిస్తున్నాం, అంతవరకు ఓకే. కానీ నిజజీవితంలో అవినీతిని సహించొద్దు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అవినీతిని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ముంబయిలోని సెన్సార్ ఆఫీస్ లో ఈ అవినీతి మరింత ఘోరంగా ఉంది. నేను చేసిన మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్ కోసం 6 లక్షల 50వేల రూపాయలు లంచం ఇవ్వాల్సి వచ్చింది."

ఇలా తన సినిమా హిందీ రిలీజ్ కోసం లంచం ఇవ్వాల్సి వచ్చిందంటూ వెల్లడించాడు హీరో విశాల్. దీనికి సంబంధించిన సాక్ష్యాల్ని కూడా ఆయన పోస్ట్ చేశాడు. సినిమా ఆల్రెడీ రిలీజ్ కు రెడీ అవ్వడంతో, లంచం ఇవ్వడం మినహా తనకు మరో ఆప్షన్ లేకపోయిందని బాధపడ్డాడు.

"రెండు విడతలుగా ఈ లంచాన్ని ఇచ్చాను. స్క్రీనింగ్ కోసం 3 లక్షలు, సర్టిఫికేట్ కోసం మూడున్నర లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. నా కెరీర్ లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఈరోజు మూవీ రిలీజ్ ఉంది, ఆల్రెడీ బిజినెస్ జరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యవర్తికి లంచం ఇవ్వడం తప్ప నాకు మరో మార్గం కనిపించలేదు. కష్టపడి నేను సంపాదించిన డబ్బు ఇలా అవినీతి పాలవ్వాల్సిందేనా? దీనికి నేను అస్సలు అంగీకరించను."

తను డబ్బులు ట్రాన్సఫర్ చేసిన బ్యాంక్ ఖాతాల పేర్లు, నంబర్లతో సహా అన్నింటినీ సోషల్ మీడియాలో పెట్టాడు విశాల్. ఈ మేరకు ఓ వీడియో కూడా రిలీజ్ చేసి, సదరు పోస్టును  మహారాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రి మోడీకి ట్యాగ్ చేశాడు. ఈ పని తనకోసం చేయడం లేదని, భవిష్యత్తులో మరో నిర్మాత ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్టు వెల్లడించాడు విశాల్. 



Source link

Related posts

కాంగ్రెస్‌లోకి వృద్ధ నాయ‌కులు!

Oknews

రోడ్డు రోల‌ర్‌, చ‌పాతి మేక‌ర్‌, కారు… బీఆర్ఎస్‌కు షాక్‌!

Oknews

ఆస్కార్ కోసం దిల్ రాజు ఏం చేయబోతున్నాడు..?

Oknews

Leave a Comment