Health Care

‘సైబర్‌ కాండ్రియా’ మీకు హాని చేస్తుంది.. ఎందుకంటే..


దిశ, ఫీచర్స్ : మీరు మీలో కనిపించే మెడికల్ సింప్టమ్స్ గురించి కానీ, ఇతరులు ఎదుర్కొనే హెల్త్ ఇష్యూస్ గరించి కానీ ఆందోళన చెందుతున్నారా? అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి రోజులో అత్యధిక సార్లు ఇంటర్నెట్‌ సెర్చ్ చేస్తున్నారా? కనీసం 1 గంట నుంచి 3 గంటల వరకు సెర్చ్ చేస్తున్నారా? అయితే మీరు ‘సైబర్‌ కాండ్రియా’అనే మానసిక రుగ్మతను ఎదుర్కొంటూ ఉండవచ్చ. ఇటీవల కొందరిలో ఇది పెరిగిపోతోందని మానసిక నిపుణులు అంటున్నారు.

నిరాశకు గురిచేస్తుంది

కొన్ని సంవత్సరాలుగా ఇంటర్నెట్ హెల్త్ ఇన్ఫర్మేషన్‌తో నిండిపోయింది. ప్రజలు తమకు అవసరం అనిపించినప్పుడల్లా ఆన్‌లైన్‌లో ఈ సమాచారన్ని వెతుకుతున్నారు. ఇక 90 శాతం మంది అమెరికన్లు వివిధ వెబ్‌సైట్‌లలో ఆరోగ్య సమాచారం కోసం సెర్చ్ చేశారని, 33 శాతం మంది తమ ఆరోగ్య పరిస్థితి నిర్ధారణ కోసం వెతుకుతున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కొవిడ్ తర్వాత ఈ సెర్చింగ్ ట్రెండ్ మరింత పెరిగిపోయింది. కానీ అది క్రమంగా ఆందోళన, నిరాశ భావాలకు కారణం అవుతోంది.

పరిష్కారమేంటి?

కొందరు ఇంటర్నెట్‌లో తప్పుడు సమాచారం వల్ల తమకు ఏమైందోనని మరింత బాధకు లోనుకావచ్చు. మరికొందరు ఆన్‌లైన్ సమాచారం ఆధారంగా తమకు ఏం జరుగుతుందోనని భయపడవచ్చు. ఇలాంటి వారంతా మానవ శరీరం వ్యాధులకు ప్రతి స్పందించడానికి, తనను తాను రక్షించుకోవడానికి ఒక రకమైన మార్గాన్ని కలిగి ఉంటుందని గుర్తుంచుకోవాలి. హెల్త్ పరమైన ప్రతి విషయంలో ఆందోళన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఆందోళన, అతి ఆలోచన ధోరణి నుంచి బయటపడటమే సైబర్ కాండ్రియా రుగ్మతకు చక్కటి పరిష్కారం. సొంత ప్రయత్నం లేదా వైద్య నిపుణులు సలహా ఇందుకు పనిచేస్తుంది.



Source link

Related posts

బాదం నూనెతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

Oknews

తెగిన వెంట్రుకల ఖరీదు రూ. 12 లక్షలు.. వేలం పాటలో 1200 మంది పోటీ

Oknews

సిగ్గాకు మొక్కను, ఆకుల్ని చూశారా ?.. తింటే ఆ కోరికలు ఆపుకోలేరట !

Oknews

Leave a Comment