సిద్ధిపేటలో మరో యువకుడు…..సిద్ధిపేట జిల్లా మర్కుక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. గుర్తుతెలియని సైబర్ నేరగాడు పేస్ బుక్ లో ఫోర్ వీలర్ అమ్మకానికి ఉన్నదని తన మొబైల్ కు కాంటాక్ట్ నెంబర్ పంపించాడు. అది నమ్మిన సదరు బాధితుడు అతని వివరాలు అడగగా ఆర్మీ డ్రెస్ లో ఉన్న ఫోటో మరియు ఆర్ సి తదితర వాహనం యొక్క పేపర్లు పంపించాడు. అది నమ్మిన బాధితుడు సైబర్ నేరగాడు చెప్పిన విధంగా ట్రాన్స్పోర్ట్ చార్జి, జీఎస్టీ తదితర ఖర్చులు ఉంటాయని డబ్బులు పంపిస్తే వాహనం డెలివరీ చేస్తానని చెప్పాడు. దీంతో అతడు సైబర్ నేరగాడు పంపించిన ఫోన్ నెంబర్ కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా రూ. 97,649 పంపించాడు. తదుపరి ఆ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానం వచ్చిన బాధితుడు జాతీయ సైబర్ సెల్ నెంబర్ 1930 ఫోన్ చేసి వివరాలు తెలిపి ఫిర్యాదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.
Source link