GossipsLatest News

సైలెంట్ గా ఓటీటీలోకి కన్నడ బ్లాక్ బస్టర్



Sun 14th Apr 2024 06:16 PM

kaatera  సైలెంట్ గా ఓటీటీలోకి కన్నడ బ్లాక్ బస్టర్


A silent Kannada blockbuster that came to OTT సైలెంట్ గా ఓటీటీలోకి కన్నడ బ్లాక్ బస్టర్

గత ఏడాది డిసెంబర్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ కి పోటీగా కన్నడ లో విడుదలైన దర్శన్ కాటేరా చిత్రం అద్భుతమైన విజయం కాదు.. సలార్ తో పోటీ పడి అక్కడ 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అయితే కన్నడలో సూపర్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం పలు భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తారని అనుకున్నారు. KGF మాదిరి ఈ చిత్రం కూడా పాన్ ఇండియా మార్కెట్ లో సెన్సేషన్ అవ్వుద్ది అనుకున్నారు. 

కానీ అలా జరగలేదు. కాటేరా చిత్రం ఏ భాషలోనూ విడుదల కాలేదు. కన్నడ థియేటర్స్ లో విడుదలైన రెండు నెలలకి Zee 5 నుంచి ఈచిత్రం స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ ఇలా ఇతర భాషల్లో ఎక్కడా స్ట్రీమింగ్ అవ్వలేదు. అసలు ఆల్మోస్ట్ ఈ చిత్రం గురించి అందరూ మర్చిపోయారు కూడా. కానీ ఇప్పుడు సైలెంట్ గా కాటేరా చిత్రం తెలుగు వెర్షన్ Zee 5లో ప్రత్యక్షమైంది. 

ఈరోజు అంటే ఏప్రిల్ 14 ఆదివారం కాటేరా చిత్రం Zee 5 నుంచి స్ట్రీమింగ్ అవ్వడం చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంత సైలెంట్ గా బ్లాక్ బస్టర్ చిత్రం కాటెరా ని ఓటీటీలోకి వదిలేశారేమిటా అని మాట్లాడుకుంటున్నారు. థియేటర్స్ లో విడుదలైన ఐదు నెలల తర్వాత కాటేరా తెలుగు వెర్షన్ ఇప్పటికి ఓటీటీ ఆడియన్స్ అందుబాటులోకి వచ్చింది. 


A silent Kannada blockbuster that came to OTT:

 Kaatera Movie Telugu Version Streaming Now On Zee5









Source link

Related posts

ఆకాశంలో ఒక తార.. దుల్కర్ స్పీడ్ మామూలుగా లేదు!

Oknews

Pooja Hegde To Move In To New House ఖరీదైన ఇంటికి షిఫ్ట్ అవుతున్న బుట్ట బొమ్మ

Oknews

కన్నీళ్లు  పెట్టుకున్న తెలంగాణ నటుడు..

Oknews

Leave a Comment