EntertainmentLatest News

సైలెంట్ గా సీక్వెల్ షూటింగ్ మొదలైంది!


చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈమధ్య పలు సినిమాలు సీక్వెల్స్ బాట పడుతున్నాయి. ఇప్పుడదే బాటలో మరో క్రేజీ మూవీ పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా ఏదో కాదు ‘మత్తు వదలరా’. అధికారికంగా ప్రకటించకుండానే.. సైలెంట్ గా ఈ మూవీ సీక్వెల్ షూటింగ్ ని ప్రారంభించినట్లు సమాచారం.

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా పరిచయమైన సినిమా ‘మత్తు వదలరా’. రితేశ్ రాణాను దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ కామెడీ థ్రిల్లర్.. 2019 డిసెంబరు 25న విడుదలై ఘన విజయం సాధించింది. ఇందులో కడుపుబ్బా నవ్వుకునే కామెడీ, కావాల్సినంత థ్రిల్ ఉండటంతో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘తస్కరించుట’ అంటూ సత్య చేసిన కామెడీ గానీ, ‘ఓరి నా కొడకా’ పేరుతో సీరియల్ స్పూఫ్ గానీ ఎంతగానో మెప్పించాయి. అందుకే ఈ సినిమాని ఎందరో ఇష్టపడతారు. రిపీటెడ్ గా చూస్తుంటారు. అంతలా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాకి త్వరలో సీక్వెల్ రాబోతున్నట్లు వినికిడి.

కొద్దిరోజుల క్రితం ‘మత్తు వదలరా-2’ షూటింగ్ ప్రారంభమైందట. మూవీ టీం పక్కా ప్లానింగ్ తో సైలెంట్ గా సీక్వెల్ ని కంప్లీట్ చేసి సర్ ప్రైజ్ ఇవ్వాలని చూస్తోందట. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే కామెడీ పరంగా, థ్రిల్ పరంగా సెకండ్ పార్ట్ అంతకుమించి ఉంటుందట. గతేడాదే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసి, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి కావాల్సినంత టైం తీసుకొని.. రీసెంట్ గా షూట్ కి వెళ్లారట. ఏప్రిల్ నాటికి మొత్తం షూట్ పూర్తి చేసి, జూలైలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. శ్రీసింహా, సత్య పాత్రలతో పాటు ‘ఓరి నా కొడకా’ సీరియల్ కామెడీ ట్రాక్ కూడా సీక్వెల్ లో ఉంటుందట. ఈ సీక్వెల్ ని కూడా మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తుండగా.. కాల భైరవ సంగీతం అందిస్తున్నాడట.



Source link

Related posts

Revanth Reddy participates in Palamuru Praja Deevena Sabha in Mahabubnagar slams KTR and BRS Party | Revanth Reddy: సన్నాసుల్లారా! నేను మోదీని లోపలింట్ల కలవలే, నిధులు రాకుంటే ఉతికి ఆరేస్తా

Oknews

Don’t miss out on your competitors and partners’ product launches

Oknews

Shanmukh Jaswanth who wanted to commit suicide ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: షణ్ముఖ్

Oknews

Leave a Comment