GossipsLatest News

సోము, విష్ణు, జీవీల్‌‌కు టికెట్ ఇవ్వలేదేం!


సోము, విష్ణు, జీవీల్‌‌కు టికెట్ ఇవ్వలేదేం!

అవును.. ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ అధిష్టానం తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు టికెట్ ఎవరికి వచ్చిందో..? పార్టీ కోసం ఎవరు పనిచేశారో..? మొదట్నుంచీ ఇప్పటి వరకూ పార్టీలో ఉంటూ వచ్చిన వారెవరు..? అనే విషయాలు కనీసం అధిష్టానానికి తెలియకపోవడం గమనార్హం. అభ్యర్థుల ప్రకటన తర్వాత ఏపీలో ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ.. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వారిని ఎందుకు గుర్తించలేదు. ముఖ్యంగా.. సీనియర్లు సోము వీర్రాజు, జీవీఎల్ నర్సింహారావు, విష్ణువర్ధన్ రెడ్డిలకు ఎందుకు కమలనాథులు విస్మరించారనేది ఎవరికీ అర్థం కాని విషయం.

అసలేం జరిగింది..?

సోము, విష్ణు, జీవీల్‌ ఈ ముగ్గురూ కట్టర్ బీజేపీ నేతలే. ఈ ముగ్గురూ పార్టీ కోసం ఏ రేంజ్‌లో పనిచేశారో.. ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఈ ముగ్గురిలో ఒక్కరంటే ఒక్కరికీ టికెట్ రావడం వెనుక చాలా పుకార్లు షికార్లు చేస్తు్న్నాయి. ముగ్గూరు సీనియర్లే.. పార్టీ కోసమే పనిచేశారు కానీ.. బీజేపీ కోసం కాదని వైసీపీ కోసం పనిచేశారన్నది ప్రధాన ఆరోపణ. అందుకే ముగ్గర్నీ  అధిష్టానం పక్కనెట్టేసిందని బీజేపీ వర్గాల నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. రెడ్డికి రెడ్డి అన్నట్లుగా విష్ణు తన సామాజిక వర్గమైన వైఎస్ జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడని వకల్తా పుచ్చుకున్నారనే ఆరోపణలు చాలాసార్లే వచ్చాయి. ఇక.. జీవీఎల్ అయితే అన్నీ వైసీపీకి సపోర్టుగానే చేసుకుంటూ వచ్చారన్నది తీవ్ర స్థాయిలో వచ్చిన విమర్శలు, ఆరోపణలు. మరోవైపు.. సోము విషయానికొస్తే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులూ వైసీపీని పొల్లెత్తు మాట అనలేదని.. అధికారపార్టీ ఏం చేసినా సరే కనీసం రియాక్షన్ లేకపోవడంతో ఆఖరికి తన పదవికే ఎసరు తెచ్చుకున్నారన్నది ఈయనపై ఉన్న ఆరోపణ.

ఎవరేం ఆశించారు..?

వాస్తవానికి.. విష్ణు అనంతపురంలో ఏదో అసెంబ్లీ లేదా హిందూపురం ఎంపీగా పోటీచేయాలని భావించారు. కానీ.. ఇది టీడీపీ ఖాతాలోకి పోగా.. మరో ఎమ్మెల్యే సీటును సత్యకుమార్ దక్కించుకున్నారు. దీంతో విష్ణుకు దారులన్నీ మూసుకుని పోయాయి. తాను సీనియర్‌ను అని.. సీటు ఆశించడంలో ఎలాంటి తప్పులేదన్నారు విష్ణు. అయితే హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాత్రం స్పష్టం చేశారు. ఇక జీవీఎల్ మాత్రం వైజాగ్ ఎంపీగా పోటీచేయాలని ఎన్నో కలలు కన్నారు. ఈయనకు పోటీగానే పురంధేశ్వరి కూడా సీటు ఆశించారు కానీ.. బాలయ్య అల్లుడు భరత్ టీడీపీ తరఫున పోటీచేస్తుండటంతో సీటు వదులుకోవాల్సి వచ్చింది. అయితే తనకు వైజాగ్ కావాలని ఢిల్లీలో పెద్ద ఎత్తునే పైరవీలు నడిపినప్పటికీ అస్సలు ఈయన్ను లెక్కేచేయలేదు అగ్రనేతలు. ఇక సోము మాత్రం రాజమండ్రి అసెంబ్లీ లేదా పార్లమెంట్ సీటు దక్కితే చాలని ఆశించారు కానీ అదేమీ జరగలేదు. ఈ ముగ్గురి ఆశలు నిరాశలే అయ్యాయి. అయితే వీరిలో మొదలైన అసంతృప్తిని తగ్గించేందుకు ఏదో ఒక పదవి ఇవ్వడానికి అధిష్టానం సిద్ధం చేస్తోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ముగ్గురు నేతలు చేజేతులారా చేసుకున్నారని మాత్రం చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.



Source link

Related posts

Certificate Verification for pgt posts held on Febraury 10 and 11check venues here

Oknews

తిరగబడరా సామి మూవీ రివ్యూ

Oknews

ఈ నెలలో ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు, సిరీస్ లు!

Oknews

Leave a Comment