దిశ, ఫీచర్స్ : ఆధునిక జీవితంలో సోషల్ మీడియా ఒక భాగమైపోయింది. సమాచార సర్వస్వంగానూ, ఎంటర్టైన్మెంట్ వేదికగానూ ఎంతోమందిని అలరిస్తోంది. ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ఎక్స్(ట్విట్టర్).. ఇలా రకరకాల ప్లాట్‌ఫామ్‌లలో ప్రజలు తమ ఎకౌంట్స్ కలిగి ఉంటున్నారు. సొంత ప్రయోజనాలకు, వ్యాపార అవసరాలకు, సామాజిక సంబంధాలకు ఇదెంతో ఉపయోగపడుతోంది. అదే సందర్భంలో కొన్ని సమస్యలు కూడా ఉంటున్నాయి. ఎందుకంటే ఇది రెండువైపులా పదును కలిగిన కత్తిలాంటిది. ఎవరు ఏ అవసరాలకు ఉపయోగిస్తారో అలాంటి ఫలితాలే వస్తాయి. అయితే ప్రస్తుతం మనం సోషల్ బెనిఫిట్స్ గురించి చర్చిద్దాం.
ఈజీ అండ్ ఫన్నీ
మనం కొత్త సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఇతర మాధ్యమాల్లో సంబంధిత కంటెంట్ కాస్త టఫ్‌గా అనిపించవ్చు. కానీ సోషల్ మీడియాలో ఆ ప్రాబ్లం ఉండదు. ఇందులోని చాలా కంటెంట్స్ ఈజీగా, ఫన్నీగా ఉంటాయి. త్వరగా ఆకట్టుకుంటాయి. అందరికీ అర్థం అవుతాయి. ఉదాహరణకు పిల్లులు మనుషుల్లా ప్రవర్తించే క్రేజీ వీడియోస్ ఎప్పుడైనా చూశారా? ఫన్నీగా ఉంటాయి. నవ్వడం ఆరోగ్యానికి మంచిది. ఇక్కడ మనం ఒక బెనిఫిట్ పొందినట్టే కదా.
ఇతరులతో కనెక్ట్ అవ్వడం
ఒక్కసారి సోషల్ మీడియా లేని రోజులను ఊహించుకోండి. అప్పట్లో మన ఇంటి చుట్టు పక్కల వారు, ఎప్పుడూ అందుబాటులో ఉండేవారితోనే పరిచయాలు ఉండేవి. కానీ సోషల్ మీడియావల్ల నేడు ప్రపంచమే మారిపోయింది. డిఫరెంట్ పీపుల్‌తో కనెక్ట్ అవుతున్నాం. కొత్త విషయాలను, కొత్త సమాచారాన్ని తెలుసుకుంటున్నాం. డిఫరెంట్ కల్చర్ గురించి అవగాహన ఏర్పడుతోంది.
వంటకాలు, కమ్యూనిటీస్
మన పుస్తకాల అరలో ఎప్పుడూ చూడలేని గొప్ప వంటకాలను సోషల్ మీడియాలో కనుగొనవచ్చు. వీడియోలను ఫాలో అవడం, క్రియేట్ చేయడం ఇప్పుడు చాలా కామన్ అండ్ సింపుల్. కొత్త వంటకాలను నేర్చుకోవడం, ఇతరులకు వాటి గురించి సమాచారం ఇవ్వడం ఎందరినీ ఆకట్టుకుంటోంది. సొంత ఆసక్తులు ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఆన్‌లైన్‌లో ఏ విధమైన కమ్యూనిటీనైనా మనం ప్రోత్సహించవచ్చు.
టచ్‌లో ఉండే అవకాశం
ప్రముఖులతో, సెలబ్రెటీలతోనే కాకుండా మనకు నచ్చినవారిని ఫాలో అవుతూ టచ్‌లో ఉండే గొప్ప అవకాశం సోషల్ మీడియా కల్పిస్తుంది. అలాగే ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశంలేని వ్యక్తులతో, చిన్ననాటి స్నేహితులతో సన్నిహితంగా ఉండటానికి, కనెక్ట్ అవ్వడానికి ఇదొక అద్భుతమైన మార్గం. ప్రపంచవ్యాప్తంగా అనేక మందితో కనెక్ట్ అవ్వడం ద్వారా వారి అలవాట్లు, ఆసక్తులు, సమస్యల గురించి మరింత తెలుసుకోవచ్చు. అలాగే సామాజికంగా, రాజకీయంగా ప్రయోజనం కలిగించే సోషల్ మీడియా మార్గాలలో ఇదొకటి.
సంఘీభావం పొందడం, తెలపడం
మనం ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు ఇతరులకు సంఘీభావం తెలుపడం కానీ, పొందడం కానీ సాధ్య పడకపోవచ్చు. కానీ సోషల్ మీడియాలో ఒక్కపోస్టు పెడితే చాలు ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ఏదో ఒక రూపంలో సంఘీభావం తెలియజేస్తారు. అలాగే సామాజిక సమస్యలపై స్పందించడానికి, అన్యాయాలకు వ్యతిరేకంగా వాయిస్ వినిపించడానికి సోషల్ మీడియా చక్కటి వేదికగా ఉంటోంది. ప్రజలు సంఘటితం అయ్యేందుకు కూడా ఇది సహాయపడుతుంది. ఉదాహరణకు LGBTQ కమ్యూనిటీకి మద్దతు ఇచ్చే అనేక ఈవెంట్స్ సోషల్ మీడియా లేకుండా సాధ్యపడవు.
సామాజిక, రాజీకీయ అంశాలు
రాజకీయ, సామాజిక, వ్యాపార, ప్రభుత్వ కార్యకలాపాలకోసం సోషల్ మీడియాను ఉపయోగించుకోవచ్చు. సోషల్ ఈవెంట్స్‌ను గ్రూప్ చాట్స్‌తో మనేజ్ చేయడానికి ఉపయోగించుకోగల గొప్ప సాధనం సోషల్ మీడియా. ఇక నిర్వాహకులు తమ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి, నెట్‌వర్క్ విస్తరించడానికి, బ్రాండ్‌లను ప్రచారం చేయడానికి ఇది ఎంత గొప్పగా ఉంటుందో తెలిసిందే. ఇవే కాకుండా ఇది సంగీత కచేరీలు, సినిమాలు, ఇతర కార్యక్రమాలను ప్రమోట్ చేయడంలో ప్రముఖంగా ఉంటోంది. ప్రభుత్వాలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి కూడా సోషల్ మీడియా చక్కటి వేదిక.
ఆన్‌లైన్ డేటింట్
ఆన్‌లైన్ డేటింగ్ సైట్స్, అలాగే యాప్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల మధ్య అనుబంధాలను పెంచుతున్నాయి. శృంగార జీవితాలను రూపొందిస్తున్నాయి. ది నాట్ 2019 జ్యువెలరీ అండ్ ఎంగేజ్‌మెంట్ స్టడీ ప్రకారం 22% జంటలు ఆన్‌లైన్‌లో కనెక్ట్ అయి భాగస్వాములుగా మారుతున్నారు.సోషల్ మీడియా ద్వారా అనేక విషయాల్లో ప్రేరణ పొందవచ్చు. కొత్త వ్యక్తులు, కొత్త సమాచారం వల్ల స్ఫూర్తి పొందవచ్చు. మనమే ఇతరులకు స్ఫూర్తిగా నిలిచే చాన్స్ కూడా ఉంటుంది. అలాగే కొత్త నైపుణ్యాలు, జీవన విధానాలను నేర్చుకోవచ్చు. ప్రస్తుతం ఇన్‌స్టాలో, ఫేస్‌బుక్‌లో అనేకమంది తమ రోజువారీ అంశాలను పోస్ట్ చేస్తున్నారు. ఇందులో ప్రేరణ కలిగించేవి కూడా ఉంటాయి.
న్యూస్, ఆన్‌లైన్ క్లాసెస్
ఒకప్పుడు కొత్త న్యూస్ కోసం మరుసటి రోజు వరకు వేచి చూడాల్సి వచ్చేది. సోషల్ అందుబాటులోకి వచ్చాక ఏ వార్త అయినా క్షణాల్లో తెలిసిపోతోంది. అయితే తప్పుడు సమాచారం కూడా ఉండవచ్చు. ఇక్కడే జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే మ్యూజిక్, యోగా, గిటార్, కవిత్వం ఇలా మనం ఆసక్తి కలిగిన ప్రతి ఒక్క నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి సోషల్ మీడియాలో బోలెడంత సమాచారం అందుబాటులో ఉంటోంది.
క్రియేటివిటీ అవుట్‌లెట్‌గా..
ప్రస్తుతం సోషల్ మీడియా క్రియేటివిటీకి ఒక అవుట్‌లెట్‌గా నిలుస్తోంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ తమ సృజనాత్మకతను ప్రదర్శించవచ్చు. వీడియోలు, ఫొటోలు ఇలా ఏ కంటెంట్ క్రియేట్ చేసేవారైనా, అది ఎంత చిన్నదైనా ఇక్కడ తప్పకుండా ప్రేక్షకులను కలిగి ఉంటుంది. మనం ప్రదర్శించే క్రియేటివిటీ, అందులోని సమాచారం ఎవరికో ఒకరికి తప్పకుండా ఉపయోగపడే వేదిక ఏదైనా ఉందంటే సోషల్ మీడియానే.
వర్క్ అండ్ కెరీర్స్
కెరీర్ పరంగా సోషల్ మీడియా బంగారు గని వంటిది. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు, కెరీర్ అంశాలు తరచుగా పోస్ట్ చేయడుతూ ఉంటాయి. సంబంధింత వెబ్‌సైట్స్‌ను యూజర్లు, క్రియేటర్లు షేర్ చేస్తూ ఉంటారు. అప్లికెంట్ ప్రాసెస్ కూడా ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఉదాహరణకు నేడు లింక్డ్ ఇన్ ఒక పెద్ద సోషల్ మీడియా నెట్‌వర్క్‌గా ఉంది. అలాగే స్టూడెంట్స్‌కు అవసరమైన సమాచారం కూడా సోషల్ మీడియాలో ఫుల్లుగా ఉంటుంది. సబ్జెక్టుకు సంబంధించిన వీడియోలు, ట్యూటర్లు అందుబాటులో ఉంటాయి.
మార్కెట్ ప్లేస్ కూడా..
మనం కొత్త నగరానికి మారినట్లయితే, నివసించడానికి అనువైన కొన్ని పరిసరాల గురించి అవగాహన కలిగి ఉన్న వ్యక్తుల అభిప్రాయాలను పొందవచ్చు. అలాగే సోషల్ మీడియాలో మార్కెట్ ప్లేస్ గురించి, అద్దెకు లభించే అపార్టుమెంట్స్ గురించి కూడా సమాచారం ఉంటుంది. ఉదాహరణకు Facebookలో ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ సెకండ్ హ్యాండ్‌లో, తక్కువ ధరలో లభించే ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి.
నేరాలను అరికట్టవచ్చు
నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, ప్రభుత్వ శాఖలు, ప్రజలు నేడు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు, సమాచారం, ఇతర అంశాలు ఇక్కడ ఉంటాయి. అలాగే ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఆయా విభాగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఏదైనా ఎమర్జెన్సీ తలెత్తితే, ఏవైనా ఇబ్బందలు ఎదుర్కొంటూ ఉంటే ఒక్క పోస్టు పెడితే అందరూ స్పందిస్తారు. ఇక నేరస్థులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంలో పోలీసుకు సోషల్ మీడియా కూడా నేడు ఉపయోగపడుతోంది.
బీ కేర్‌ఫుల్
సోషల్ మీడియావల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దానిని సక్రమంగా ఉపయోగించుకోకపోతే సమస్యలు తలెత్తవచ్చు. మితిమీరిన వినియోగం వ్యసనంగా మారవచ్చు. సోషల్ మీడియాపై ఓవర్ ఇంట్రెస్ట్ మన వ్యక్తిగత, సామాజిక జీవితాలపై, సంబంధాలపై ప్రభావం చూపే చాన్స్ ఉంటుంది. వర్క్ అండ్ ప్రాక్టికల్ సామర్థ్యాన్ని దెబ్బతీయవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఒక లిమిట్ ప్రకారం యూజ్ చేసుకుంటే సోషల్ మీడియావల్ల చాలా బెనిఫిట్స్ పొందవచ్చు.