సౌకర్యంగా ఉన్నంత వరకు గ్లామర్ షో చేస్తా Great Andhra


మెగా ఫ్యామిలీ నుంచి వచ్చింది మడికట్టుకొని ఉంటుందని అనుకుంటారంతా. కొన్ని పాత్రలు మాత్రమే చేస్తుంది, కమర్షియల్ హీరోయిన్ గా కనిపించదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అలాంటి డౌట్స్ అక్కర్లేదంటోంది నిహారిక కొణెదల.

“నేను ఎంత కంఫర్టబుల్ గా ఫీల్ అవుతానో అంతవరకు గ్లామర్ షో చేస్తాను. అంతే తప్ప, స్కిన్ షో కోసం గీత దాటను. నాకు ఎంత వరకు కంఫర్ట్ ఉంటుందో, అంతవరకు గ్లామరస్ గా కనిపించడానికి రెడీ.”

ఇలా ఓ లిమిట్ వరకు గ్లామర్ గా కనిపించడానికి రెడీ అని ప్రకటించింది నిహారిక. ఇక యాక్టింగ్ విషయానికొస్తే, యాక్టింగ్ కెరీర్ పై తను చాలా సీరియస్ గా ఉన్నానని, ఇండస్ట్రీలోనే చాలామందికి అపోహలున్నాయని అంటోంది.

“యాక్టింగ్ కెరీర్ పై నేను సీరియస్ గా ఉన్నాను, నేను సీరియస్ గా ఉన్నాననే విషయం ఇండస్ట్రీలో తెలియడం లేదనుకుంటా. మెగా ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని అనే ఆలోచనతో చాలామంది వెనకంజ వేస్తున్నారు. నేను నో చెబుతాననే భయంతో అసలు నన్ను సంప్రదించడం లేదు. నా వెనక చాలా పవర్స్ ఉన్నాయని వాళ్ల భయం. అందుకే తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేస్తున్నాను.”

కేవలం హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ మాత్రమే చేస్తానని చాలామంది అనుకుంటున్నారని, పాత్రకు ప్రాధాన్యం ఉంటే 5 నిమిషాల క్యారెక్టర్ అయినా చేస్తానని క్లారిటీ ఇచ్చింది నిహారిక.

కథ మొత్తం తన చుట్టూ తిరగాలన్న కండిషన్స్ లేవని, స్టోరీ కూడా తను ఒక్కదాన్నే వింటానని, కాంపౌండ్ లో ఎవ్వరికీ కథ చెప్పాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ స్టేట్ మెంట్ తర్వాతైనా నిహారికకు అవకాశాలొస్తాయేమో చూడాలి.



Source link

Leave a Comment