EntertainmentLatest News

స్టార్‌ హీరో సినిమాకీ తప్పని రిలీజ్‌ కష్టాలు!


ఈ ఏడాది దసరా సీజన్‌లో విడుదలయ్యే సినిమాలు భగవంత్‌ కేసరి, టైగర్‌ నాగేశ్వరరావు, లియో. ఈ మూడు సినిమాలపైనే అందరి దృష్టీ ఉంది. ఈ మూడూ పాన్‌ ఇండియా సినిమాలే కావడంతో వివిధ రాష్ట్రాలలో థియేటర్ల సర్దుబాటు అనే ప్రక్రియలో ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే మనం ఈ మూడు సినిమాలనే చూస్తున్నాం. కానీ, బాలీవుడ్‌ నుంచి గణపథ్‌ రాబోతోంది. దీంతో థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇవి చాలవన్నట్టు శివరాజ్‌కుమార్‌ హీరోగా నటించిన కన్నడ సినిమా ఘోస్ట్‌ కూడా లిస్ట్‌లో ఉంది. ఇది కూడా పాన్‌ ఇండియా సినిమా రిలీజ్‌ అవుతోంది. ఈ సినిమాకి కర్ణాటకలో థియేటర్ల సమస్య లేదు. భారీ బడ్జెట్‌తో ఎంతో హై రేంజ్‌ సినిమాగా రూపొందిన ఘోస్ట్‌ చిత్రానికి అభిమానుల్లో మంచి హైప్‌ ఉంది. కానీ, తెలుగు, తమిళ్‌ విషయానికి వస్తే ఈ సినిమాకి అంత సీన్‌ కనిపించడం లేదు. పైగా చాలా సినిమాలు రిలీజ్‌ అవుతుండడంతో ఘోస్ట్‌కి థియేటర్స్‌ దక్కేది అనుమానమే. అందుకే తెలుగు, తమిళ్‌ వెర్షన్ల వరకు అక్టోబర్‌ 27కి వాయిదా వెయ్యాలని మేకర్స్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కన్నడ వెర్షన్‌ రిలీజ్‌ డేట్‌లో ఎలాంటి మార్పు లేదు. కానీ, కన్నడ వెర్షన్‌ రిలీజ్‌ అయిన తర్వాత టాక్‌ బాగుంటే ఓకే. లేకపోతే రిస్క్‌ తప్పదు. అందుకే ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు ఘోస్ట్‌. ఈ సినిమా తెలుగు రైట్స్‌ ఎవరు తీసుకున్నారనేది తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 



Source link

Related posts

జగన్ ఓటమిలో రాజమౌళి కూడా ఒక భాగం

Oknews

drug control bureau officers searches in hyderabad blood banks | Blood Banks: డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు

Oknews

Supreme Court Gives Shock to AP CM Jagan Mohan Reddy జగన్‌కు ఒకేరోజు రెండు దెబ్బలు..

Oknews

Leave a Comment