హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో.. ఆడియో అంత కంటే పెద్ద హిట్ అయింది. మణిశర్మ స్వరపరిచిన పాటలు మాస్ ని ఉర్రూతలూగించాయి. ఇప్పుడు మరోసారి ‘ఇస్మార్ట్’ టీం మాస్ అలరించడానికి సిద్ధమైంది.
‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్ గా రూపొందుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీకి కొన్ని వారాలే సమయం ఉండటంతో.. మూవీ టీం పాటల జాతరను మొదలుపెట్టింది. “స్టెప్పమార్” అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ప్రోమోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ప్రోమోకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మరోసారి ‘ఇస్మార్ట్’ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఫుల్ సాంగ్ జులై 1 న విడుదల కానుంది. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, సాహితి ఆలపించారు.