Entertainment

స్పైడర్ మ్యాన్ పై రూమర్స్ ..ఉంటుందా లేక మోసమా!


2002 లో ప్రారంభమయ్యిన  స్పైడర్ మ్యాన్ (spider man) సిరీస్ కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్ద అందరు కూడా ఈ సిరీస్ కి బ్రహ్మ రధం పట్టారు. అయితే  గత కొన్ని రోజులుగా స్పైడర్ మ్యాన్ లవర్స్ కి ఒక విషయంలో బెంగ పట్టుకుంది.కరెక్ట్ గా ఇదే సమయంలో వస్తున్న ఒక వార్త ఇప్పుడు వాళ్ళల్లో ఆనందాన్నినింపుతుంది.

 టోబి మాగ్యుర్ (tobey maguire) ఆండ్రూ గార్ ఫీల్డ్(Andrew Garfield)టామ్ హాలండ్( tom holland) లు  స్పైడర్ మ్యాన్స్ గా నటించి అశేష అభిమానులని సంపాదించారు. ఆ తర్వాత ఈ ముగ్గురిని కలిసి స్పైడర్ మ్యాన్  నో వే హోమ్ లో కూడా నటించారు. 2021 లో వచ్చిన ఆ మూవీ ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్స్ ని కూడా సృష్టించింది. ఒక లెక్కన అది స్పైడర్ మ్యాన్ 3 కిందకి వస్తుంది. దాని తర్వాత స్పైడర్ మ్యాన్ 4 (Spider Man 4) కూడా ఉంటుందని అందరు భావిస్తు వచ్చారు. కానీ మూడు సంవత్సరాల నుంచి ఎలాంటి అప్ డేట్ రాకపోవడంతో అసలు 4 ఉంటుందా లేదా అనే డౌట్ అందరిలో మొదలయ్యింది.ఇప్పుడు  స్పైడర్ మ్యాన్ 4 సెప్టెంబర్ లో గాని అక్టోబర్ లో గాని షూట్ కి వెళ్లబోతుందనే వార్తలు వస్తున్నాయి.

ప్రఖ్యాత యాక్షన్  డైరెక్టర్  జస్టిన్ లిన్ స్పైడర్ మ్యాన్ 4 కి దర్శకత్వం వహించబోతున్నాడని అంటున్నారు.  ఈయన దర్సకత్వంలో వచ్చిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్  వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ అందర్నీ ఎంతగానో మెస్మరైజ్ చేసింది. ప్రఖ్యాత  హీరోయిన్ జెండాయ కూడా ఇందులో నటిస్తుందనేది హాలీవుడ్  టాక్. 

 



Source link

Related posts

‘లంబసింగి’ మూవీ రివ్యూ

Oknews

ప్రారంభమైన ‘బుజ్జి ఇలా రా 2’

Oknews

ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Oknews

Leave a Comment