Health Care

స్లీప్ డివోర్స్ అంటే ఏమిటి.. ఎలా తీసుకుంటారో తెలుసా ?


దిశ, ఫీచర్స్ : ఈ మధ్యకాలంలో చాలా జంటలు పెళ్లి అయిన కొన్ని నెలలకో, సంవత్సరాలకో విడాకులు తీసుకుంటున్నారు. ఈ కాలంలో ఈ విషయం సర్వసాధారణమైంది. ఇప్పుడు తాజాగా డీవోర్స్ కి బదులు స్లీప్ డివోర్స్ తీసుకుంటున్నారంట. ఇదేదో వింటుంటే కొత్తగా ఉంది కదా.. అసలు స్లీప్ డివోర్స్ అంటే ఏమిటి, ఎలా తీసుకుంటారు. చాలా మందికి తెలిసి ఉండదు. ఆ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

చాలా జంటలు ఏదో ఒక విషయంలో గొడవలు పడుతూనే ఉంటారు. అలాంటి సమయంలో విడిపోతే బాగుండు అనుకుంటారు. అయితే పూర్తిగా డివోర్స్ కాకుండా స్లీప్ డివోర్స్ తీసుకుంటారు. అయితే స్లీవ్ డివోర్స్ అంటే భార్యాభర్తలు పూర్తిగా విడిపోవడం కాదండీ ఒకే ఇంట్లో, ఒకే గదిలో, ఒకే మంచం పై ఉన్నా ఎలాంటి సంబంధం లేకుండా దూరంగా ఉండడం అన్నమాట. దీన్నే స్లీప్ డివోర్స్ అంటారట.

స్లీప్ డివోర్స్ కారణంగా జీవితంలో తీసుకునే నిజమైన విడాకుల సంఖ్య తగ్గిపోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. గొడవలు పడి విడాకులు తీసుకోవాలనుకునే వారు మొదటగా వేరువేరు గదుల్లో పడుకోవడం మాత్రమే కాదు అన్ని పనులు వేరువేరుగా చేసుకుంటారట. కానీ ఈ స్లీప్ డివోర్స్ లో మాత్రం ఇద్దరూ ఒకే బెడ్ పై విడివిడిగా పడుకున్నా మిగతా పనులన్నీ కలిసే చేస్తారట. ఉదాహరణకు కుటుంబ బాధ్యతలు, పిల్లల పోషణ ఇలాంటి పనులు.

ఈ స్లీప్ డివోర్స తీసుకోవడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తమ జీవిత భాగస్వామి నిద్రలో దిండుని కౌగిలించుకోవడం, గురక పెట్టడం, రాత్రి వేళల్లో సోషల్ మీడియాను ఎక్కువగా వాడడం, నిద్రపట్టనివ్వకుండా రాత్రి పూట టీవీ చూడటం వంటి అలవాట్లు ఉంటే ఈ నిర్ణయం తీసుకంటారట. ఈ కారణాలతో విడాకులు తీసుకుని జీవితాంతం విడిపోవడం కన్నా స్లీప్ డివోర్స్ తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. రోజు మొత్తంలో కలిసి పనిచేసినా నిద్ర విడాకులు తీసుకుని రాత్రి వేళల్లో ఎవరికి వారు సెపరేట్ గా పడుకుంటారు. ఇలా చేయడం వలన దాంపత్య జీవితంలో ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయట. స్లీప్ డివోర్స్ అంటే జీవితంలో ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా ప్రశాంతంగా కొన్ని గంటలు మంచి నిద్రను పొందడం మాత్రమే అంటున్నారు నిపుణులు.



Source link

Related posts

పదేపదే ఫేస్ వాష్ చేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలిస్తే షాక్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

Oknews

కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Oknews

అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా?.. డైట్‌లో చియా సీడ్స్ తీసుకోండి !

Oknews

Leave a Comment